కెనడా-భారత్ వ్యాఖ్యల మీద అమెరికా స్పందన
ఖలీస్థానీ విషయంలో భారత్, కెనడాల మధ్య వివాదం ముదురుతోంది. దీని మీద అగ్రదేశం అమెరికా స్పందించింది. ట్రూడో ఆరోపణల మీద ఆందోళన వ్యక్తం చేసింది.
ఖలీస్థానీ విషయంలో భారత్, కెనడాల మధ్య వివాదం ముదురుతోంది. దీని మీద అగ్రదేశం అమెరికా స్పందించింది. ట్రూడో ఆరోపణల మీద ఆందోళన వ్యక్తం చేసింది.
అమెరికాలో భారతీయ విద్యార్థి మృతి చెందిన ఘటనపై అక్కడి పోలీసులు వెకిలి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పోలీస్ అధికారికి మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియో జాహ్నవి మరణంపై పోలీసు అధికారి వెకిలిగా మాట్లాడిన మాటలను స్పష్టంగా వినవచ్చు.
అమెరికాలో మరణించిన తెలుగు యువతి మీద అక్కడి పోలీస్ అధికారి ఒకరు చులకనగా మాట్లాడారు. చచ్చిపోయింది మామూలు వ్యక్తే...ఏదొ కొంత డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది అంటూ హేళన చేశారు. దీని మీద భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
మొబైల్ ఫోన్లలో రారాజు అయిన ఆపిల్ ఐఫోన్ కొత్త సీరీస్ ఇవాల్టి నుంచి అందుబాటులోకి వచ్చేస్తోంది. వండర్ లస్ట్ పేరుతో అమెరికాలో ఆపిల్ కంపెనీ ఈవెంట్ నిర్వహించనుంది. దీంట్లో ఐఫోన్ 15 సీరీస్ తో పాటూ వాచ్ అల్ట్రా మోడల్స్ ను లాంచ్ చేస్తున్నారు.
అమెరికాలో తెలుగు విద్యార్థులకు చుక్కెదురైంది. 21మంది భారతీయ విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కు పంపించారు. అగ్రరాజ్యంలో పలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులను సరైన పత్రాలు లేవన్న కారణంతో వారిని వెనక్కు పంపించారు.
అమెరికాలో ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం అల్లాడిపోతున్నారు. భయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ఇండియానాకు చెందిన యాష్లే సమ్మెర్స్ అనే మహిళ.. ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లింది. ఎండ వేడిని భరించలేక ఆమె డీహైడ్రేట్ కు గురయ్యింది. దీంతో కేవలం 20 నిమిషాల్లోనే రెండు బాటిల్స్ నీరు తాగేసింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే తనకు తలనొప్పిగా, వికారంగా, నీరసంగా ఉందని..
మాస్టర్స్ చేదివేందుకు అగ్రరాజ్యం అయినటువంటి అమెరికాకు వెళ్లిన తెలంగాణ యువతి అక్కడ రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది.ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా తన కుమార్తెను భారత్కు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ (S Jaishankar)కు లేఖ రాసింది.అక్కడ ఆ మహిళ దారుణమైన దయనీయస్థితిలో కనిపిస్తోంది.అంతేకాదు ఆమె వస్తువులన్నీ దొంగిలించబడ్డాయి.తన చేతిలో ఏమీలేక పొరుగుదేశంలో తనొక అనాథలాగా బ్రతుకుతోంది.ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.