TS Election Results: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న #RevanthReddy.. సీఎం ఆయనేనా?
సోషల్ మీడియాలో #RevanthReddy ట్రెండ్ అవుతోంది. మరో వైపు రేవంత్ అభిమానులు ఆయన ఇంటికి చేరుకుని సంబరాలు స్టార్ట్ చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట భద్రతను పెంచారు.
సోషల్ మీడియాలో #RevanthReddy ట్రెండ్ అవుతోంది. మరో వైపు రేవంత్ అభిమానులు ఆయన ఇంటికి చేరుకుని సంబరాలు స్టార్ట్ చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట భద్రతను పెంచారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఆ పార్టీ 65-70 సీట్లు సాధించడం ఖాయం కానుంది. ఈ రోజు సాయంత్రానికి గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు హస్తం పార్టీ.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దుమ్మురేపింది. 65సీట్లతో కాంగ్రెస్ విజయం సాధించింది. కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇక కాంగ్రెస్ సీఎం రేపే ప్రమాణస్వీకారం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ప్రముఖ జ్యోతిష్యుడు నమిలికొండ రమణ చార్యులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈసారి రేవంత్ రెడ్డికి గ్రహాబలం ఉనప్పటికీ కేసీఆర్ కే రాజయోగం ఉందని చెప్పారు. మరో మూడేళ్ల 6 నెలలు కేసీఆర్ సీఎంగా ఉంటారన్నారు.
అధికారం కాంగ్రెస్ దేనని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న నేపథ్యంలో ఆ పార్టీ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను రంగంలోకి దించింది. మరో ముగ్గురు సీనియర్ నేతలను అబ్జర్వర్లుగా నియమించింది.
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ భద్రతను భారీగా పెంచారు. సీనియర్ పోలీసు అధికారులు దగ్గరుండి మరీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఈ భద్రతను చూస్తుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అనే సంకేతాలు అందుతున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
40 శాతం ఓట్ షేర్ దక్కించుకున్న పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018లో బీఆర్ఎస్ 47 శాతం ఓట్ షేర్ సాధించగా.. కాంగ్రెస్ 29 శాతానికే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో ఈ లెక్కలు ఎలా మారుతాయన్నది ఆసక్తిగా మారింది.
తెలంగాణ పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయబోతున్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలోని అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే అధికారమన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ కు ఓటమి తప్పదని స్పష్టంచేశారు.