నగరానికి విచ్చేసిన సోనియా, రాహుల్, ప్రియాంక..ఆహ్వానం పలికిన రేవంత్
మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక లు నగరానికి చేరుకున్నారు.
మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక లు నగరానికి చేరుకున్నారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ కాన్వాయ్ ఎక్కేందుకు నిరాకరించారు. బుధవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయనకు అధికారులు కాన్వాయ్ ఏర్పాటు చేయగా వద్దని చెప్పారు. తానింకా ప్రమాణ స్వీకారం చేయలేదని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మ.1:04 గంటలకు LB స్టేడియంలోగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఢిల్లీ నుంచి ఇప్పటికే హైదరాబాద్ బెగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రేవంత్.. అక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్లారు.
సీఎంగా పేరు ప్రకటన తర్వాత నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ కు తిరిగివచ్చారు. అధిష్టానంతో చర్చల తర్వాత మంత్రుల జాబితాతో ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. రేపు రేవంత్ తో పాటు మొత్తం ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.
ఎన్నికలకు ముందు జరిగిన 'ఇండియా టుడే' కాన్క్లేవ్లో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ డీఎన్ఏ బీహార్‌కు చెందినదని.. తన డీఎన్ఏ తెలంగాణదని చెప్పిన రేవంత్.. బీహార్ డీఎన్ఏ కంటే తెలంగాణ డీఎన్ఏ గొప్పదంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది.
రేపు తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. ఈ వేడుకకు సంబంధించిన ప్రతీ అంశంపై సోషల్ మీడియాలో ఆసక్తిగా మారుతోంది. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రేపు ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుందని.. ఈ మహోత్సవానికి అందరూ రావాలని లేఖలో కోరారు కాబోయే సీఎం రేవంత్.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినపుడు జరిగిన వేడుకకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉన్న నేతలు హాజరు అయ్యారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇండియా కూటమి నేతల హాజరుపై అనుమానాలు మొదలయ్యాయి.