Prime minister Modi:తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోదీ.
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ప్రధాన నరేంద్రమోదీ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ను విజయవంతంగా నడిపారు. ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపిన అనుభవం అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ప్రధాన నరేంద్రమోదీ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ను విజయవంతంగా నడిపారు. ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపిన అనుభవం అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. అదుపు.. మాట పొదుపు అని మరికొందరంటారు. కాలు జారినా తీసుకోవచ్చు కానీ.. నోరు జారితే తీసుకోలేమని ఇంకొందరంటారు. అందులోని సెక్సీయెస్ట్ కామెంట్స్ చేస్తే ఎవ్వరూ ఊరుకోరు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా ఇదే చేశారు. తన పార్టనర్ నోటి దూలకి తగ్గ సమాధానం చెప్పారు.
ప్రధాని మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. నిజామాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనడంతో పాటూ 8021కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. నిజామాబాద్ లో బీజెపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా పేరు పెట్టారు.
అవ్వా కావాలి...బువ్వ కావాలి అన్నట్టున్నాయి కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చేసిన వ్యాఖ్యలు. భారత్ తో సన్నహిత సంబంధాలకు కట్టుబడి ఉంటామని చెబుతూనే నిజ్జర్ హత్యోదంతాన్ని మాత్రం వదిలేదని హింట్ ఇస్తున్నారు. మరోవైపు అమెరికా కూడా మావైపే ఉందంటూ ప్రకటిస్తున్నారు.
మేము చేసింది ఘోరమైన తప్పు అంటున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో. ఒకవైపు భారత్ తో ఖలిస్తానీ వివాదం, మరో వైపు ఉక్రెయిన్ తో నాజీ అంశం కెనడాను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. దీంతో ఉక్రెయిన్ కు క్షమాపణలు చెప్పారు ట్రుడో. మేము ఘోర తప్పిదం చేశామంటూ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా దాన్ని రెండు రోజుల ముందుకు అంటే సెప్టెంబర్ 30 కు మార్చారు. మహబూబ్ నగర్ లో బీజెపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడనున్నారు.
వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 450 కోట్లతో నిర్మిస్తున్న ఈ స్టేడియం 2025 డిశంబర్ కు పూర్తి అవుతుంది. శివుడి ప్రేరణతో దీనిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
పార్లమెంటు సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.