Municipal Elections : మున్సిపల్ ఎన్నికలు.. జనసేన మద్దతుపై బీజేపీ డైలమా!
బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ప్రకటించినప్పటికీ, ఈ విషయంలో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడ్డట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ప్రకటించినప్పటికీ, ఈ విషయంలో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడ్డట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తెలంగాణలో పురపాలక ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన పలువురు రెబల్ అభ్యర్థులుగా రంగంలో నిలిచారు. దీంతో ప్రధాన పార్టీలకు అసమ్మతి సెగలు తప్పడం లేదు. ఆయా పార్టీల బుజ్జగింపులు ఫలించకపోవడంతో పలువురు రెబల్స్ గా బరిలో నిలిచారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 11న జరగనున్న ఏడు నగర పాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల ఎన్నికల్లో మొత్తం 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోటీదారుల్లో 6,508 మంది (50.27శాతం) మహిళలు ఉండగా, 6,436 (49.73 శాతం) మంది పురుషులున్నారు.
42శాతం రిజర్వేషన్‌తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించిన ప్రభుత్వం దానికి ఆమోదం లభించకపోవడంతో ప్రస్తుత ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించింది. మిగిలిన పార్టీలు సైతం అదే స్థాయిలో టికెట్లు ఇచ్చి బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
మున్సిపాల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ వేళ అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టికెట్ రాని వారి అలకలు, నాయకుల బుజ్జగింపులు, తిరుగుబాట్లతో అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గందరగోళం నెలకొంది. ఉపసంహరణల తర్వాత 12,993 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో సీపీఐ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. ఈ మేరకు బీఆర్ఎస్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, సీపీఐ నాయకుల మధ్య సయోధ్య కుదిరింది
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కాగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నగదు రవాణాపై కఠిన నియమాలను అమలు చేయనున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈరోజు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న మీడియా సమావేశంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
రాజకీయ పార్టీగా మారకముందే తెలంగాణ జాగృతి ఎన్నికల బరిలో నిలవనుందా? ఇండిపెండెంట్లుగా ఒకే గుర్తుపై పోటీ చేయనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో సుమారు 20 నుంచి 30 స్థానాల్లో తమ అభ్యర్థులను దింపేందుకు కవిత వ్యూహరచన చేస్తున్నారు.