KCR : నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం 8 వ సారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలు దాటిన తరువాత ఆయన స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకోనున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం 8 వ సారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలు దాటిన తరువాత ఆయన స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకోనున్నారు.
సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ను.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ త్వరగా అసెంబ్లీకి రావాలని.. ప్రజల సమస్యలను ప్రస్తావించాలని కోరుతున్నానని రేవంత్ మీడియాతో తెలిపారు. మంచి ప్రభుత్వ పాలన అందించేందుకు ఆయన సూచనలు అవసరమన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఎం కేసీఆర్‌ను ఆయన పరామర్శించనున్నారు. రేవంత్ వెంట మంత్రులు కూడా వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది.
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోంది. తుంటి ఎముక మార్పిడీ చికిత్స చేయించుకున్న ఆయన ఆరోగ్యం ఇప్పుడు కుదురుకుంటోంది. తాజాగా కేసీఆర్‌తో నడిపించే ప్రయత్నం చేశారు వైద్యులు. కేసీఆర్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదానికి గురికావడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్‌కు గాయమైందన్న వార్త తనను బాధించిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోధ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కాలు జారి కింద పడగా.. ఆయన తుంటి ఎముక విరిగినట్లు సమాచాం. దాంతో ఆయన సికింద్రాబాద్‌లోని యశోధ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.