Delhi: స్కూల్‌లోకి తుపాకీ తీసుకెళ్లిన 5వ తరగతి విద్యార్థి.. హడలిపోయిన సిబ్బంది!

ఢిల్లీలోని ఓ స్కూల్లోకి పదేళ్ల బాలుడు తుపాకీ తీసుకురావడం సంచలనం రేపింది. పిల్లవాడు క్లాస్ రూమ్‌లో గన్ బయటకు తీయడంతో సిబ్బంది, తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

New Update
Army officer suicide: నగరంలో ఆత్మహత్య చేసుకున్న జవాన్‌!

Delhi school: ఢిల్లీలోని ఓ స్కూల్లో భయంకర సంఘటన చోటుచేసుకుంది. ఐదొవ తరగతి చదువుతున్న పదేళ్ల బాలుడు తుపాకితో పాఠశాలకు రావడంతో సిబ్బందితోపాటు తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే బాలుడి దగ్గరనుంచి తుపాకి తీసుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులను పిలిపించి విచారించగా.. ఆ తుపాకి పిల్లవాడి తండ్రిదని తెలిపారు. అతడు కొన్ని నెలలక్రితం చనిపోవడంతో ఇంట్లోనే దాచి ఉంచామని, అనుకోకుండా తమ పిల్లవాడు తీసుకొచ్చాడని వివరించారు. దీంతో తుపాకిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే లైసెన్స్ రద్దు చేయాలని అధికారులకు సూచించారు. ఇక ప్రమాదకరమైన వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాలని, నిరంతరం స్కూల్‌కు వెళ్లే పిల్లల బ్యాగ్‌ చెక్‌ చేయాలని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు