IND vs NZ : బిగ్ షాక్.. కోహ్లీకి గాయం!

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సెషన్‌లో పేసర్ ను ఎదురుకునే క్రమంలో కోహ్లీకి గాయమైంది.  మోకాలికి దగ్గర గాయం కావడంతో వెంటనే కోహ్లీ ప్రాక్టీస్ ఆపేయగా... స్ప్రే వేసి, ఆ ప్రాంతాన్ని కట్టుతో కట్టారని తెలుస్తోంది.

New Update
Kohli injured

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది. న్యూజిలాండ్, భారత్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. ఇక  దక్షిణాఫ్రికాపై 50 పరుగుల తేడాతో గెలి న్యూజిలాండ్  ఫైనల్ లో చోటు సంపాదించింది. దీంతో ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మార్చి 9 (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.  స్టార్ ఆటగాడు కోహ్లీ గాయపడ్డాడు.  ప్రాక్టీస్ సెషన్‌లో పేసర్ ను ఎదురుకునే క్రమంలో కోహ్లీకి గాయమైంది.  మోకాలికి దగ్గరలో గాయం కావడంతో  వెంటనే కోహ్లీ ప్రాక్టీస్  ఆపేశాడని గాయం అయిన చోట  స్ప్రే వేసి, ఆ ప్రాంతాన్ని కట్టుతో కట్టారని తెలుస్తోంది.  అయితే కోహ్లీ గాయం తీవ్రంగా లేదని ఫైనల్ మ్యాచ్ ఆడేముందు కోహ్లీ ఫిట్ గా ఉంటాడని  భారత కోచింగ్ సిబ్బంది స్పష్టం చేశారు.

ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 83.14 స్ట్రైక్ రేట్‌తో 217 పరుగులు చేశాడు. ఇందులో పాకిస్తాన్‌పై సెంచరీ, ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్నింగ్‌లో 84 పరుగులు చేశాడు.  ఇప్పుడు భారత్ తరపున కోహ్లీనే  టాప్ స్కోరర్.  

జట్ల అంచనా 

న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.


భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్.

Also read :  కోమా నుంచి లేచొచ్చి పేషెంట్ హల్ చల్.. డాక్టర్లకు చుక్కలు చూపించాడు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు