/rtv/media/media_files/2025/03/03/h2xjd0whCszCuE0PLtjI.jpg)
ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా ఓడినా పాకిస్థాన్ ఆటగాళ్ల బుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఆ దేశ మాజీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్ నోరు పారేసుకున్నారు. బాబర్ ఆజమ్‌తో పోల్చొద్దని .. కోహ్లీ జీరో అని వాఖ్యనించాడు. బాబర్ గణాంకాలతో కోహ్లీకి పోలికా? అని ప్రశ్నించాడు. ఇలాంటి విషయాల గురించి చర్చించడం దండగ అన్నాడు. ప్రస్తుతం పాక్ క్రికెట్ గురించి చర్చించాలి. మన జట్టుకు ప్రణాళికలు, వ్యూహాలు, జవాబుదారీతనం లేవు. తిరిగి గాడిన పడాలని పేర్కొన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఆట తీరుపై ఆ దేశ క్రికెట్ మాజీలు మండిపడ్డారు. ముఖ్యంగా బాబర్ ఆజమ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, కోచ్‌లు అతని పేలవమైన ప్రదర్శనపై విలపించారు. అయితే అందుకు భిన్నంగా మొహ్సిన్ ఖాన్ ఆశ్చర్యకరమైన ప్రకటన చేస్తూ, బాబర్ ఆజంతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఏమీ కాదని నొక్కి చెప్పాడు. కోహ్లీ సున్న అంటూ ఎద్దేవా చేశాడు.
Former cricketer Mohsin Khan expressed a strong opinion, stating that Virat Kohli is nowhere near Babar Azam in terms of skill. He saic in his view, Kohli is insignificant compared to Babar and criticized him quite harshly
— Bemba Nation (@BembaNation) March 1, 2025
The level of knowledge😭😁😁😁 pic.twitter.com/pXM0UZTyBP
ఆజమ్ ఓపెనర్ కాదు
మరోవైపు, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంతిఖాబ్ ఆలం కూడా బాబర్ ఆజమ్ ను ఓపెనర్‌గా పంపినందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)ను తీవ్రంగా విమర్శించారు. ఆజమ్ ఓపెనర్ కాదు. నంబర్ 3 బ్యాటింగ్ లైనప్ కి అతను వెన్నెముక, మీరు ఆ స్థానంలో బాబర్ ను పంపించే ఉంటే బాగుంటుంది. అతను ఖచ్చితంగా సెంచరీ కొట్టేవాడని అన్నాడు.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీకి ముందు కాస్త ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్ తో మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆటను వీదేశీ ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. అలాంటిది మొహ్సిన్ ఖాన్ విమర్శలు చేయడం సిగ్గుచేటని నెటిజన్లు ట్వీ్ట్స్ చేస్తున్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిందంటూ సూచిస్తున్నారు.
Also read : Group Exams Results: గ్రూప్స్ అభ్యర్థులకు అలెర్ట్.. ఫలితాలపై కీలక అప్‌డేట్