చూసి నేర్చుకోండి.. విదేశాల్లో సంప్రదాయబద్ధంగా.. జడేజా భార్యపై ప్రశంసలు!

స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబా జడేజా, కూతురుతో కలిసి ట్రోఫీతో ఫొటోలు దిగారు. అయితే, విదేశాల్లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌కూ సంప్రదాయబద్ధంగా చీరలో వచ్చి రివాబా అందరి దృష్టినీ ఆకర్షించారు. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

New Update
Rivaba Jadeja

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొత్తం టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టోర్నీని కైవసం చేసుకుంది. అనంతరం జట్టుతో కుటుంబసభ్యులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. న్యూజిలాండ్‌  పై గెలిచి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గర్వంగా ముద్దాడిన వేళ జట్టు సభ్యులు ఆనందంగా కనిపించారు. తోటి ప్లేయర్లతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. 

సంప్రదాయబద్ధంగా చీరలో వచ్చి

విరాట్ భార్య  అనుష్క , రోహిత్ భార్య  రితిక, కూతురు సమైరాలతో కలిసి సందండి చేశారు.  ఈ సందర్భంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబా జడేజా, కూతురుతో కలిసి ట్రోఫీతో ఫొటోలు దిగారు. అయితే, విదేశాల్లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌కూ సంప్రదాయబద్ధంగా చీరలో వచ్చి రివాబా అందరి దృష్టినీ ఆకర్షించారు. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను చూసి అందరూ నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.  

 పెళ్లికి ముందు ఆమెను రివా సోలంకి అని పిలిచేవారు. రివాబా రాజ్‌కోట్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. రివాబా, రవీంద్ర జడేజా ఒక పార్టీలో కలుసుకోగా అక్కడ వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. 2016 ఏప్రిల్ 17న వివాహం చేసుకున్నారు. 2020లో రివాబా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ స్థానం నుండి పోటీ చేసి, అక్కడ భారీ విజయం సాధించారు.

న్యూజిలాండ్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో  నాలుగు వికెట్లు చేతిలో ఉండగానే సాధించింది. దీంతో భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.  ఫైనల్ మ్యాచ్‌లో 83 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ పోషించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 

Also Read :  రోహిత్ శర్మ ఆస్తులెంత.. ఒక్కో మ్యాచ్ కు జీతం ఎంత తీసుకుంటాడు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు