AUS vs IND: పక్కా వ్యూహంతోనే కొన్‌స్టాస్ గొడవ.. అసలు నిజం బయటపెట్టిన పంత్!

బుమ్రాతో ఆసీస్ ఓపెనర్ కొన్‌స్టాస్ గొడవపై రిషబ్ పంత్ స్పందించాడు. సమయం వృథా చేయాలనే వ్యూహంలో భాగంగానే కొన్‌స్టాన్‌ గొడవకు దిగాడని పంత్ అభిప్రాయపడ్డాడు. మరో ఓవర్‌ వేయకుండా సమయాన్ని వృథా చేయాలని వారు భావించినట్లు తమకు అర్థమైందని తెలిపాడు.

New Update
rishabh pant react on sam konstas argument

rishabh pant react on sam konstas argument

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా - భారత్ మధ్య ఐదో (చివరి) టెస్టు రసవత్తరంగా జరుగుతోంది. అయితే తొలిరోజు తొలి ఆట ముగిసే సమయంలో గ్రౌండ్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆసీస్ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్‌ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది జరిగిన నెక్స్ట్ బాల్‌కి ఆసీస్ ప్లేయర్ ఖవాజ్ ఔటవడంతో భారత ప్లేయర్లు రచ్చ రచ్చ చేశారు. 

ఇది కూడా చదవండి: HMPV వైరస్.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన!

అయితే ఈ గొడపై తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ స్పందించాడు. కొన్‌స్టస్ కావాలనే గొడవకు దిగాడని అన్నాడు. సమయం వృథా చేయాలనే వ్యూహంతోనే బుమ్రాతో కొన్‌స్టాస్ గొడవపడ్డాడని అభిప్రాయపడ్డాడు. మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. వారు సమయం వృథా చేయాలని అనుకున్నారు అని అన్నాడు. అందుకే బుమ్రాతో కొన్‌స్టాస్ గొడవ పడ్డాడని భావిస్తున్నానన్నాడు. తాము ఇంకో ఓవర్ వేయకుండా సమయాన్ని వృథా చేయాలని వారు భావించారని తమకు అర్థమైనట్లు చెప్పుకొచ్చాడు. 

ఇది కూడా చదవండి: 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్ కు కియారా అందుకే రావట్లేదా..?

ఏం జరిగిందంటే?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా - భారత్ మధ్య కీలకమైన మ్యాచ్ జరుగుతోంది. సిడ్నీ వేదికగా ఐదో (చివరి) టెస్టు రసవత్తరంగా ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అతి తక్కువ పరుగులే చేసింద. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 72.2 ఓవర్లలో కేవలం 185 పరుగులకే ఆలౌట్ అయింది.

1 వికెట్ నష్టానికి 9 పరుగులు 

అనంతరం ఈ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ మొదటి నుంచే తడబడుతుంది. భారత బౌలర్లు ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా బుమ్రా అయితే ఇక చెప్పాల్సిన పనేలేదు. తన మార్క్ బౌలింగ్‌తో చెలరేగిపోతున్నాడు. అయితే తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌ను నమోదు చేసింది. 1 వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. 

బుమ్రా vs కొన్‌స్టాస్

మరో బాల్ వేస్తే ఇవాళ ఆట ముగుస్తుందన్న సమయంలో బుమ్రాకి ఆసీస్ బ్యాటర్ కొన్‌స్టాస్‌కి మధ్య వాగ్వాదం జరిగింది. బుమ్రా బౌలింగ్ వేస్తున్న సమయంలో స్ట్రైక్‌లో ఉన్న ఉస్మాన్ ఖవాజా మధ్యలో ఆగాడు. దీంతో ఏమైందంటూ బుమ్రా ప్రశ్నించాడు. ఆ సమయంలోనే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కొన్‌స్టాస్ సమాధానమిచ్చాడు. దీంతో ‘నువ్ ఎందుకు మాట్లాడుతున్నావ్’ అంటూ ప్రశ్నించాడు బుమ్రా.

ఇక కొన్‌స్టాస్ కూడా వెనక్కి తగ్గకుండా నోటికి పనిచెప్పాడు. దీంతో బుమ్రా, కొన్‌స్టాస్ మధ్య గొడవ పెద్దదైంది. ఇక అంపైర్లు కలుగజేసుకుని గొడవని సర్దుమనిగించారు. గొడవ అనంతరం అదే ఓవర్ చివరి బాల్ బుమ్రా వేయగా.. స్ట్రైక్‌లో ఉన్న ఖవాజా ఔటయ్యాడు. స్లిప్‌కు క్యాచ్ ఇచ్చాడు. దెబ్బకి భారత ఆటగాళ్లలో ఆ ఆక్రోశం చూడాలి ఓ రేంజ్‌లో ఉంది. స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టగానే బుమ్రా ఫైర్ మామూలుగా లేదు. వెంటనే కొన్‌స్టాస్ వైపు చూశాడు. 

ఇది కూడా చూడండి: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

విరాట్ ఫైర్

ఇక అదే సమయంలో విరాట్ కోహ్లీ ఊరుకుంటాడా. సరదా సరదాకే చిర్రెత్తిపోతాడు. ఇలాంటి టైంలో కోహ్లీని ఆపడం ఎవరితరం కాదు. ఇలా క్యాచ్ పట్టాడో లేదో.. అలా అరుపులతో గోల గోల చేశాడు. దీంతో సిడ్నీ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు