/rtv/media/media_files/2025/03/05/vq10Q7aTE0sncsOvUaXj.jpg)
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మార్చి 05వ తేదీన వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ (73) అత్యధిక పరుగులు చేశాడు.
Also read : దత్తత తీసుకున్నోళ్లకు దూరమై.. కట్టుకున్నోడి చేతిలో హతమై.. ఆ మేనమామే లేకుంటే..!
In a surprising turn of events, the legendary Steve Smith has announced the end of his remarkable ODI career. 😳#SteveSmith | #CricketNews | #Cricket https://t.co/fTAjQcexbF
— CRICKET COIN (@cricketcoinfun) March 5, 2025
2010లో వన్డేలోకి ఏంట్రీ
ఆస్ట్రేలియా తరఫున అత్యంత విజయవంతమైన ఆటగాళ్ళలో ఒకరైన స్మిత్ 2010లో వెస్టిండీస్‌తో వన్డేలో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 170 వన్డేలు ఆడిన స్మిత్ 43.28 సగటుతో 5 వేల 800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 34.67 సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు. 2016లో న్యూజిలాండ్‌పై 164 పరుగులతో తన అత్యధిక స్కోరు.
Smith retires from ODIs after Champions Trophy exit #SteveSmith #Australia #ICC #ODIs #Cricket pic.twitter.com/3YWNqt4Zxm
— Briomatic (@Briomatic11) March 5, 2025
2015, 2023లలో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలిచిన జట్లలో సభ్యుడైన స్మిత్ 2015లో మైఖేల్ క్లార్క్ తరువాత వన్డే కెప్టెన్ అయ్యాడు. 64 మ్యాచ్‌లకు కెప్టెన్ గా వ్వవహరించిన స్మిత్ 32 మ్యాచ్‌లలో జట్టును గెలిపించగా.. 28 మ్యాచ్‌లలో ఓడిపోయింది. పాట్ కమ్మిన్స్ లేనప్పుడు స్మిత్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్సీని నిర్వహిస్తూ వచ్చాడు. 35 ఏళ్ల స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ టెస్ట్, టీ20 క్రికెట్‌లలో కొనసాగనున్నాడు. కాగా
Also read : కుంభమేళా వల్ల పడవలు నడిపే వ్యక్తికి రూ. 30 కోట్ల ఆదాయం..యోగి ఆదిత్య నాథ్