టీమ్ ఇండియా– ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీలో ఐదవ ఎస్ట్ మ్యాచ్ జరుగుతోంది. బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీలో ఇదే ఆఖరి మ్యాచ్. ఇందులో భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. ఈ చివరి మ్యాచ్‌లో వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిల్ శర్మను పక్కన పెట్టారు. ఇతని లేస్‌లో బౌలర్ బుమ్రా కెప్టెన్‌గా టీమ్ ఇండియా బరిలోకి దిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా లంచ్ సమయానికి మూడు వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్, జైశ్వాల్, గిల్ తమ వికెట్లను సింగిల్ డిజిట్లకే సమర్పించుకున్నారు. Also Read: Amith Shah:కాశ్మీర్ పేరు మార్పు? ఋషి కశ్యప్ పెట్టొచ్చని అన్న అమిత్ షా మరోవైపు రోహి శర్మ కెప్టెన్సీ చేయకపోవడమే కాక ఆఖరి టెస్ట్‌లో బెంచ్‌కే పరిమితం అయ్యాడు. దీనిపై మాజీ కోచ్, భారత వెటర్నర్ క్రికెటర్ రవిశాస్త్రి స్పందించాడు. రోహిత్ తీసుకున్న నిర్ణయం అద్భుతమని పొగిడారు. రోహిత్ యే తనకు తాను ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయమని అన్నారు. శుభ్‌మన్‌గిల్ ఆడితే జట్టుకు బలంగా ఉంటుందని అతను భావించాడు. అలా జరగాలంటే తాను పక్కన కూర్చోక తప్పదు. ఇవన్నీ దృషటిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్న రోహిత్ గొప్ప క్రికెటర్ అని రవిశాస్త్రి అన్నారు. రోహిత్ టెస్ట్ కెరియర్ ముగిసినట్లే.. ఇప్పుడు ఈ చివరి మ్యాచ్‌లో రోహిత్ ఆడకపోవడమే కాదు...కనీసం 16 స్క్వాడ్లో కూడా లేడు. దానికి తోడు టీమ్ ఇండయాకు దగ్గరలో ఎలాంటి టెస్ట్ సీరీస్‌లు లేవు. ఈ నేపథ్యంలో రోహిత్ కీలక నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. అతను తన టెస్ట్ కెరియర్‌కు ముగింపు పలికే ఛాన్స్ ఉందని చెబుతున్నారు నిపుణులు. జట్టులో మార్పులు తీసుకురావడం కఠినమైన నిర్ణయం. అది ప్రతీ క్రికెటర్ ఏదో ఒక సమయంలో చేయల్సి ఉంటుంది. ఇప్పుడు రోహిత్ కూడా అదే చేస్తున్నాడు అంటూ మాజీ క్రికెటర్ , కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు. ఈ పరిణామాలన్నిటితో రోహి టెస్ట్ కెరియర్ ముగిసినట్టే భావించాలని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. Also Read: అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన బుమ్రా..ఆఖరి టెస్ట్ మ్యాచ్ మొదలు