Border Gavaskar Trophy బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా (Team India) క్రికెటర్ రిషబ్ పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పంత్ టీ20 స్టయిల్ లో ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో పంత్ తొలి బంతికే సిక్స్ కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Aate hi RISHABH-PANTI shuru! 🔥When @RishabhPant17 steps in, the entertainment level goes 𝗨𝗽&𝗨𝗽 📈#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/tiJiuBOEDO — Star Sports (@StarSportsIndia) January 4, 2025 33 బంతుల్లో 61 పరుగులు చేసిన పంత్ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు. 23 బంతుల్లో 47 పరుగులు చేసిన మిగిలిన మూడు పరుగులు చేయడానికి ఆరు బంతులను ఎదురుకోవాల్సి వచ్చింది. పంత్ (Rishab Pant) కు ఇది రెండో ఫాస్టెస్ట్ టెస్ట్ ఫిఫ్టీ కావడం విశేషం. అంతకుముందు 2022లో శ్రీలంకపై 28 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు పంత్. తొలి ఇన్నింగ్స్‌లో 98 బంతుల్లో 40 పరుగులు చేసిన పంత్ .. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అంచనాలను అందుకోలేకపోయాడు. మొత్తం ఐదు మ్యాచ్‌లలో కేవలం 190 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ప్రస్తుతం భారత్ సెంకడ్ ఇన్నింగ్స్ లో ప్రస్తుతం 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా టీమ్ 180 పరుగులకే ఆలౌట్ అయింది. Also Read : రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ సంచలన ప్రకటన ఫాస్టెస్ట్ టెస్ట్ ఫిఫ్టీ చేసిన ఇండియన్ క్రికెటర్స్ 1) రిషబ్ పంత్ - 28 బంతుల్లో vs శ్రీలంక, 20222) రిషబ్ పంత్ - 29 బంతుల్లో vs ఆస్ట్రేలియా, 20253) కపిల్ దేవ్ - 30 బంతుల్లో vs పాకిస్తాన్, 19824) శార్దూల్ ఠాకూర్ - 31 బంతులు vs ఇంగ్లాండ్, 20215) యశస్వి జైస్వాల్ - 31 బంతులు vs బంగ్లాదేశ్, 2024 Also Read : 500 వికెట్ క్లబ్‌లో కమిన్స్..7వ ఆస్ట్రేలియన్‌గా రికార్డ్