R Ashwin: అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవలే వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్.. రోహిత్, కోహ్లీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన క్రికెట్ జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన స్పిన్ లెజెండ్.. తన క్రికెట్ ప్రపంచంలో తానే సూపర్ స్టార్‌నని చెప్పాడు. అలాగే తాను రాసిన "ఐ హేవ్ ద స్ట్రీట్స్: ఎ కుట్టీ క్రికెట్ స్టోరీ"బుక్ లో సహచర ఆటగాళ్ల గురించి పొందుపరిచిన పలు అంశాలను షేర్ చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Ashwin (@rashwin99) అది పూర్తిగా తప్పు.. నిజానికి నేను ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్న విషయం ఒకటి ఈ రోజు చెప్పేస్తా. ఇండియన్ క్రికెట్ గురించి చాలామంది ఓ విషయాన్ని అడుగుతుంటారు. కోహ్లీ, రోహిత్ గురించే ప్రస్తావిస్తుంటారు. నేను కూడా చిన్నప్పుడు సచిన్ గురించి ఎక్కువగా మాట్లాడేవాడిని. ఇతర సూపర్ స్టార్లు, సెలబ్రిటీల గురించి అలాగే ఆలోచించేవాడిని. అయితే ఆటలో సహచర ఆటగాళ్లు సహకరిస్తేనే నేను ఈ స్థాయికి వచ్చానంటారు. అది పూర్తిగా తప్పు. నా వరకు నేను, నా తండ్రి, తల్లి జీవితాల్లో అత్యంత విలువైన ఆటగాడిని. రోహిత్, విరాట్ బయటివారు కాదు. ప్రతిఒక్కరి ప్రయాణం విభిన్నమైనదే. నా వరకు నేనే విలువైన ఆటగాడిని" అంటూ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Ashwin (@rashwin99) ఇది కూడా చదవండి: Rythu Barosa: తెలంగాణ రైతులకు అలర్ట్.. రైతుభరోసా ఎంపికలో కీలక మార్పులు ఇదిలా ఉంటే.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటినుంచి నాలుగో టెస్టు జరగనుంది. బాక్సింగ్ డే టెస్టుపై టీమ్ ఇండియా రికార్డు బాగుండటంతో గెలుపే లక్ష్యంగా సిద్ధమవుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి.