PV Sindhu: వేడుకగా పీవీ సింధు వెడ్డింగ్ రిసెప్షన్...హాజరైన ప్రముఖులు వీరే! మంగళవారం రాత్రి నగరంలో పీవీ సింధు, వెంకట దత్త సాయిల రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన వేడుకకు తెలంగాణ సీఎం సీఎం రేవంత్ రెడ్డి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. By Bhavana 25 Dec 2024 in స్పోర్ట్స్ హైదరాబాద్ New Update pvsindhu1 షేర్ చేయండి PvSindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిల వివాహం ఆదివారం ఎంతో వేడుకగా జరిగింది.రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్‌లో డిసెంబర్ 22 రాత్రి 11.20కి సింధు, సాయిలు మూడుముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. sai sindhu Also Read: Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రోజు స్పర్శ దర్శనం రద్దు! మంగళవారం పీవీ సింధు, వెంకట దత్త సాయిల రిసెప్షన్ వేడుకగా జరిగింది. రాజకీయ, సినిమా, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు వివాహ విందుకు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. హైదరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన రిసెప్షన్ వేడుకకు తెలంగాణ సీఎం సీఎం రేవంత్ రెడ్డి హాజరై నూతన జంట సింధు, సాయిలకు శుభాకాంక్షలు తెలియజేశారు. sindhu 3 Also Read: AP: నేడు బలహీన పడనున్న అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కొత్త జంటకు ఆశీస్సులు అందించారు.భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు గురుసాయి దత్.. షట్లర్లు ప్రణయ్, చిరాగ్ శెట్టిలు పీవీ సింధు, వెంకట దత్త సాయిల రిసెప్షన్‌కు హాజరయ్యారు. sai 5 Also Read: మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ సినీ తారలు చిరంజీవి, నాగార్జున, అజిత్, ఆలీ, అర్జున్, మృణాల్ ఠాకూర్ తదితరులు నూతన జంటను ఆశీర్వదించారు. సుజనా చౌదరి, ఏపీ జితేందర్‌రెడ్డి, చాముండేశ్వరీనాథ్, శైలజా కిరణ్, హరీష్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బృహతి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. sindhu5 Also Read: ISRO: 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయ వ్యోమగామి: ఇస్రో చీఫ్ సోమనాథ్ sindhu7 #PV Sindhu Wedding Pics #pv-sindhu #Pv Sindhu wedding మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి