Pv Sindhu: ఆ విమాన ప్రయాణం తరువాత నా లైఫ్‌ టర్న్ అయిపోయింది!

పీవీ సింధు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ ప్రయాణం గురించి వివరించింది. రెండేళ్ల క్రితం చేసిన ఓ విమాన ప్రయాణంలో తాను, వెంక‌ట ద‌త్త‌సాయి కలిశామని తెలిపింది. అప్పటి నుంచే తమ ప్రేమ ప్ర‌యాణం మొద‌లైంద‌ని చెప్పుకొచ్చింది.

New Update
sindhu wedding

sindhu wedding

Pv Sindhu: భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు, పోసిడెక్స్ టెక్నాల‌జీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ వెంక‌ట ద‌త్త‌సాయి తో కలిసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. రాజస్థాన్‌ లోని ఉదయ్‌ పూర్ లో ఈ నెల 22 ఈ జంట పెళ్లి బంధంతో ఒక్క‌టైంది. ఈ వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు, మిత్రులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

Also Read:  సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ కు ప్రముఖ హీరోయిన్ సపోర్ట్, రేవంత్ పై ఫైర్

రాజస్థాన్‌లోని ఉద‌య్‌సాగ‌ర్ స‌ర‌స్సులో ఉన్న ర‌ఫెల్స్ హోట‌ల్ ఈ వివాహ వేడుక‌కు వేదిక‌ అయ్యింది. ఇక మంగళవారం రాత్రి వీరి వివాహ‌ రిసెప్షన్‌ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.

Also Read: Russia-Ukraine War: క్రిస్మస్‌ పండుగ వేళ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు

అయితే, తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వెంక‌ట ద‌త్త‌సాయితో త‌న ల‌వ్ జ‌ర్నీ గురించి సింధు చెప్పుకొచ్చింది. సాయి త‌న కుటుంబానికి సన్నిహితుడు అయినప్పటికీ కూడా  రెండేళ్ల క్రితం ఆయ‌న‌తో క‌లిసి చేసిన ఓ విమాన ప్రయాణం వల్లే త‌మ ప్రేమ ప్ర‌యాణం మొద‌లైంద‌ని సింధు చెప్పుకొచ్చింది. 

Also Read: మెదక్ చర్చి శతాబ్ది వేడుకల్లో రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో ఫొటోలు

"2022 అక్టోబ‌రులో మేమిద్ద‌రం క‌లిసి ఓ విమానంలో ప్రయాణించాం. ఆ త‌ర్వాత నా లైఫ్‌ అంతా మారిపోయింది. ఆ ప్ర‌యాణం మ‌మ్మ‌ల్ని బాగా ద‌గ్గ‌ర చేసింది. అదంతా 'ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్'లా అనిపించింది. ఆ క్ష‌ణం నుంచి మా ప్రేమ ప్ర‌యాణం మొద‌లైంది" అని సింధు వివరించింది.

Also Read: అల్లు అర్జున్‌కు ఆ తేదీ నుంచి తిరుగుండదు.. వేణు స్వామి సంచలన జ్యోతిష్యం!

ఆ ఇంటర్వ్యూలోనే సింధు తమ నిశ్చితార్థం గురించి కూడా చెప్పుకొచ్చింది. త‌మ జీవితంలో ముఖ్య‌మైన ఈ ఘ‌ట్టాన్ని తాము అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య జ‌రుపుకోవాల‌ని భావించామ‌ని, అందుకే గ్రాండ్‌గా చేయ‌లేద‌ని వివరించింది. అది చాలా భావోద్వేగ‌భ‌రిత క్ష‌ణమ‌ని, ఎప్ప‌టికీ గుర్తుండిపోయే జ్ఞాప‌క‌మ‌ని అని 'వోగ్ ఇండియా'కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సింధు చెబుతూ మురిసిపోయింది.   

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు