Pak vs Ban :బంగ్లాదేశ్తో మ్యాచ్ రద్దు.. పరువు తీసుకున్న పాకిస్థాన్ !

పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. వర్షం కారణంగా రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు. అయినప్పటికీ పాక్ జట్టు  నెట్ రన్ రేట్ విషయంలో బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉంది.

New Update
pak vs ban

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) లో భాగంగా పాకిస్థాన్ (Pakistan), బంగ్లాదేశ్ (Bangladesh) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. వర్షం కారణంగా రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 60 శాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.  దీంతో ఇరు జట్లుకు చెరో  పాయింట్ దక్కింది. అయినప్పటికీ పాక్ జట్టు  నెట్ రన్ రేట్ విషయంలో బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉంది.

Also Read :  లెజెండరీ నటుడు జీన్‌ హ్యాక్‌మ్యాన్‌ అనుమానాస్పద మృతి!

ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా

డిఫెండింగ్ ఛాంపియన్ గా సొంత గడ్డపై టోర్నీకి అతిధ్యం ఇస్తున్న పాక్..  ఇంత దారుణంగా టోర్నీ నుంచి నిష్క్రమించడం పరువు పోయినట్లేనని క్రీడానిపుణులు భావిస్తున్నారు. గ్రూప్ ఏ లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇలా మ్యాచ్ రద్దు కావడం ఇది రెండో సారి. అంతకుముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దు అయింది.  

Also read :   IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

Also read :  వీడ్ని పట్టుకుంటే రూ.లక్ష మీ సొంతం.. పోలీసుల సంచలన ప్రకటన

Also read :   ఆ పాట పాడినందుకు సిగ్గుగా ఉంది! కత్రినా పాటపై శ్రేయా ఘోషల్ హాట్ కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు