Most Runs Wicket keeper In IPL: ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బెస్ట్ వికెట్ కీపర్లు.. ధోనీ ప్లేస్ ఎంతంటే?

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు సాధించిన బెస్ట్ వికెట్ కీపర్ల జాబితా వైరల్‌గా మారింది. అందులో మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నారు.

New Update
Most Runs Wicket Keeper In IPL

Most Runs Wicket Keeper In IPL

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు సాధించిన బెస్ట్ వికెట్ కీపర్ల జాబితా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌షిప్‌కు నడిపించిన మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో దినేష్ కార్తిక్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కూడా ఉన్నారు.

Most Runs Wicket Keeper In IPL

ఐపీఎల్ చరిత్రలో వికెట్ కీపర్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది. అతను వికెట్ కీపింగ్ చేస్తూ 5321 పరుగులు సాధించారు. దీంతో ధోనీ ఇతర వికెట్ కీపర్ల కంటే అగ్రస్థానంలో నిలిచారు. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ (RPS) తరఫున 272 మ్యాచ్‌లలో 38.56 సగటుతో వికెట్ కీపింగ్ చేశారు. అతను మొత్తం 201 డిస్మిసల్స్‌తో పాటు, 155 క్యాచ్‌లు, 46 స్టంపింగ్‌లు చేసి ఐపీఎల్‌లో అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకరిగా నిలిచారు. 

ఆ తర్వాతి స్థానంలో దినేష్ కార్తిక్ ఉన్నారు. అతడు 4,469 పరుగులతో రెండవ స్థానంలో నిలిచారు. కార్తిక్ వివిధ జట్ల (ఆర్‌సిబి, కెకెఆర్, ఎంఐ, మొదలైనవి) తరఫున 238 మ్యాచ్‌లు ఆడి 26.29 సగటును కలిగి ఉన్నారు. అతను ఫినిషర్‌గా ప్రసిద్ధి చెందినప్పటికీ ధోని కంటే వెనుకబడి ఉన్నారు. 

ఇక కెఎల్ రాహుల్ 3,384 పరుగులతో (83 మ్యాచ్‌లలో, 51.27 సగటుతో) మూడవ స్థానంలో ఉన్నారు. అలాగే రిషబ్ పంత్ (3,355 పరుగులు, 115 మ్యాచ్‌లు, సగటు 34.95) నాలుగో స్థానంలో నిలిచారు. చివరిగా సంజు సామ్సన్ (3,107 పరుగులు, 115 మ్యాచ్‌లు, సగటు 32.36) ఐదో స్థానంలో ఉన్నారు. ఈ యువ వికెట్ కీపర్లు వేగంగా పురోగమిస్తున్నారు. కానీ ధోనీ రికార్డును బద్దలు కొట్టడం మాత్రం సుదూర స్వప్నంలా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు