Most Runs In IPL History: ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే..

ప్రపంచంలోనే అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టీ20 లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఒకటి. ఈ లీగ్ ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రజాదరణ పొందింది. ఎంతో మంది బ్యాటర్లు, బౌలర్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.

New Update
Most Runs In IPL History

Most Runs In IPL History

ప్రపంచంలోనే అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టీ20 లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఒకటి. ఈ లీగ్ ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రజాదరణ పొందింది. ఎంతో మంది బ్యాటర్లు, బౌలర్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఇక ఈ ఏడాది సీజన్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల అంటే మార్చి 28 నుంచి మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితా ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో టాప్ 5 బ్యాటర్లలో నలుగురు భారత క్రికెటర్లే ఉండటం గమనార్హం. వారిలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఈ టాప్ 5 బ్యాటర్ల గురించి తెలుసుకుందాం. 

Virat Kohli

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. గత ఏడాది 2025 వరకు మొత్తం 267 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. మొత్తం 8,661 పరుగులు చేశారు. దీంతో ఐపీఎల్‌లో 8వేల పరుగుల మార్కును దాటిన ఒకేఒక్క ఆటగాడిగా నిలిచారు. అలాగే ఒకే ఫ్రాంచైజీ (RCB) తరపున 8,500 కంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డును కూడా నెలకొల్పారు. IPL కెరీర్‌లో కోహ్లీ పేరిట 8 సెంచరీలు, 63 అర్థ సెంచరీలు ఉన్నాయి. 

Rohit Sharma

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ శర్మ రెండవ స్థానంలో నిలిచారు. రోహిత్ ఇప్పటి వరకు మొత్తం 272 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడారు. అందులో 7,046 పరుగులు చేశారు. తన కెరీర్‌లో 2 సెంచరీలు, 47 అర్థ సెంచరీలు ఉన్నాయి. కాగా ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్ 3 ప్లేయర్లలో రోహిత్ ఒకరు. 

Shikhar Dhawan

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో శిఖర్ ధావన్ మూడో స్థానంలో ఉన్నారు. 2024 వరకు 222 మ్యాచ్‌లు ఆడిన ధావన్.. మొత్తం 6,769 రన్స్ చేశారు. తన కెరీర్‌లో మొత్తం 51 అర్థ సెంచరీలు చేశారు. 

David Warner

ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల జాబితాలో ఉన్న నాలుగో ప్లేయర్ డేవిడ్ వార్నర్. అలాగే టాప్ 5లో ఉన్న ఒకే ఒక్క విదేశీ ప్లేయర్ కూడా ఇతడే. మొత్తం 184 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 6,565 పరుగులు చేశారు. తన కెరీర్‌లో వార్నర్ 4 సెంచరీలు, 62 అర్థ సెంచరీలు చేశారు. ఇక విదేశీ ప్లేయర్‌లలో అత్యధిక అర్థ సెంచరీలు చేసిన రికార్డు వార్నర్‌కే దక్కింది. 

Suresh Raina

సురేష్ రైనా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన 5వ ఆటగాడిగా నిలిచారు. ఆయన 5,528 పరుగులను సాధించారు. 2021 వరకు 205 మ్యాచ్‌లు ఆడారు. కాగా ఐపీఎల్‌లో 5వేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా సురేష్ రైనా నిలిచారు. అతడు ఒక సెంచరీ, 39 అర్థ సెంచరీలు చేశారు. 

Advertisment
తాజా కథనాలు