IPL 2026: CSKకు బిగ్ షాక్..IPL నుంచి ధోనీ ఔట్!

ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు బిగ్ షాక్ అందింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ MS ధోనీ గాయం కారణంగా మొదటి రెండు వారాల పాటు ఆటకు దూరం కానున్నారు.

New Update
dhoni

ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు బిగ్ షాక్ అందింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ MS ధోనీ గాయం కారణంగా మొదటి రెండు వారాల పాటు ఆటకు దూరం కానున్నారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ధోనీ కాలి కండరాల నొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకోవడానికి చికిత్స తీసుకుంటున్నారు. దీనివల్ల ఐపీఎల్ 2026 సీజన్ మొదలయ్యే మొదటి 14 రోజులు ఆయన మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని టీమ్ ఒక ప్రకటనలో తెలిపింది. త్వరగా కోలుకో తల అంటూ సీఎస్‌కే ట్వీట్ చేసింది.

ధోనీకి చివరి ఐపీఎల్

ఈ సీజన్‌లో చెన్నై జట్టు తన మొదటి మ్యాచ్‌ను గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ధోనీ లేకపోవడం జట్టుకు పెద్ద లోటు అనే చెప్పాలి. ఇది ధోనీకి చివరి ఐపీఎల్ కావచ్చనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, ఈ గాయం వార్త ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఇప్పటికే ఆయన మోకాలి నొప్పితో కూడా ఇబ్బంది పడుతున్నారు.

ఇటీవలే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ‘ROAR 26’ ఫ్యాన్ ఈవెంట్‌లో ధోనీ మాట్లాడుతూ.. తన ఫిట్‌నెస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన వయసు రీత్యా ఫిట్‌నెస్ కొంచెం తగ్గుతూ వస్తోందని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ధోనీ అందుబాటులో లేని సమయంలో వికెట్ కీపింగ్ బాధ్యతలు చూసుకోవడానికి సీఎస్‌కే పక్కా ప్లాన్‌తో ఉంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి స్టార్ కీపర్ సంజు శాంసన్‌ను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తీసుకున్నారు.

దీంతో పాటు, వేలంలో కార్తీక్ శర్మ అనే కుర్రాడి కోసం ఏకంగా రూ.14.20 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేశారు. ప్రస్తుతం జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.  కాగా ధోనీ ఐపీఎల్ రికార్డులు ఒకసారి చూస్తే...  మొత్తం 278మ్యాచ్‌లలో 5,439 పరుగులు చేసింది. ఇందులో 24 హాఫ్ సెంచరీలు,  84 అత్యధిక స్కోరు.  

Advertisment
తాజా కథనాలు