IND vs NZ : ఫైనల్లో టీమిండియా గెలవకూడదు..  అశ్విన్ కీలక కామెంట్స్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌ టాస్ గెలవకూడదని మాజీ స్పిన్నర్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. గత11 మ్యాచ్‌ల్లో టీమిండియా టాస్ ఓడిపోయినప్పటికీ చక్కటి ప్రదర్శనను కనబరుస్తోందని అభిప్రాయపడ్డాడు.

New Update
ashwin  comments

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌ టాస్ గెలవకూడదని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు, టీమిండియా ఛేజింగ్, డిఫెండింగ్ రెండింటిలోనూ బాగా రాణిస్తుందని అయితే... గత11 మ్యాచ్‌ల్లో టీమిండియా టాస్ ఓడిపోయినప్పటికీ చక్కటి ప్రదర్శనను కనబరుస్తోందని అభిప్రాయపడ్డాడు.  రేపు కూడా టాస్ ఓడి టీమిండియా టాస్ ఓడి బౌలింగ్ తీసుకుంటే బాగుంటుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్ లో భారత్ గెలిచేందుకు 54 శాతం ఛాన్స్  ఉందని అభిప్రాయపడ్డాడు. 

ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో చివరిసారిగా

కాగా 2023 నవంబర్ 15న వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో టీమిండియా చివరిసారిగా వన్డేలో టాస్ గెలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో, శ్రీలంక మరియు ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో, ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టాస్ ఓడిపోయింది.  

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. ఇక  దక్షిణాఫ్రికాపై 50 పరుగుల తేడాతో గెలి న్యూజిలాండ్  ఫైనల్ లో చోటు సంపాదించింది. దీంతో ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మార్చి 9 (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

Also Read :  IND vs NZ : బిగ్ షాక్.. కోహ్లీకి గాయం!

జట్ల అంచనా 


న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు