WTC Points Table: భారత్‌కు ఇంకా అవకాశాలు.. ఈ మెరాకిల్స్ జరిగితే ఫైనల్స్‌కే!

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐదో టెస్టులో ఆసీస్‌పై విజయం సాధించాలి. అనంతరం ఆస్ట్రేలియాలతో జరగనున్న రెండు టెస్ట్ సిరీస్‌లను శ్రీలంక కైవసం చేసుకోవాలి. అప్పుడు 55.26 శాతంతో భారత్ రెండో స్థానానికి వెళ్తుంది.

New Update
IND VS AUS

IND VS AUS WTC Points Table

ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఓటమి పాలైంది. దీంతో WTC ఫైనల్ రేసు ఉత్కంఠభరింతగా మారింది. ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరింది. ఇప్పుడు సెకండ్ ప్లేస్ కోసం ఆయా టీంల మధ్య పోరాటం కొనసాగుతోంది.

ఫైనల్‌కు చేరాలంటే ఇలా..

ఇది కూడా చూడండి: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం

ఇక ఫైనల్‌కు చేరాలన్న టీమిండియా ఆశలు నీరుగారుతున్నట్లు అర్థమవుతోంది. బాక్సింగ్ డే టెస్టులో ఓడిన భారత్ ఫైనల్‌కు చేరే అవకాశాను పూర్తిగా క్లిష్టతరంగా మార్చుకుంది. మరి టీమిండియా ఫైనల్‌కు చేరాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

  • సౌతాఫ్రికా 66.67 శాతంతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచి ఫైనల్‌కు చేరుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి డబ్ల్యూటీసీ పట్టికలో ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచింది. 
  • ఇప్పుడు ఫైనల్‌కు చేరే రెండో టీం ఏదనేది ఆసక్తికరంగా, ఎంతో ఉత్కంఠభరింగా మారింది. 
  • ఇవాళ (డిసెంబర్ 30)న జరిగిన టెస్టులో భారత్ ఓటమిపాలవ్వడంతో ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశం ఉన్నాయి. 

    ఇది కూడా చూడండి: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి

  • ప్రస్తుతం ఆస్ట్రేలియా టీమ్ 61.46 శాతంతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. 
  • బాక్సింగ్ టెస్ట్‌లో ఓటమితో టీమిండియా 52.78 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సైకిల్‌లో భారత్ ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. 
  • ఈ సిరీస్‌లోని లాస్ట్ టెస్ట్‌లో భారత్ గెలిచినా.. ఫైనల్‌కు చేరాలంటే ఇతర జట్ల రిజల్ట్స్‌పై ఆధారపడాల్సిందే.
  • టీమిండియాకు అవకాశాలు ఉండాలంటే కొన్ని మెరాకిల్స్ జరగాల్సిందే. అందులో త్వరలో ఆస్ట్రేలియా - శ్రీలంక మద్య రెండు టెస్టుల సిరీస్ ఉంది. 

    ఇది కూడా చూడండి: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు

  • ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 0-2 తేడాతో ఓడిపోతే అప్పుడు భారత్‌కు ఛాన్స్ ఉంటుంది. 
  • దీంతో భారత్ ఖాతాలో 55.26 శాతం ఉంటుంది. అనంతరం ఆసీస్ 53.51 శాతానికి, శ్రీలంక 53.85 శాతానికి చేరుకుంటాయి. 
  • అయితే ఇలా జరగాలంటే ముందుగా త్వరలో ఐదో సిరీస్‌లో ఆసీస్‌పై భారత్ విజయం సాధించాలి.  
  • అలా కాకుండా శ్రీలకంతో టెస్టు సిరీస్‌లో 2 మ్యాచ్‌లు డ్రా అయితే మాత్రం మెరుగైన ప్లేస్‌లో ఉన్న టీం టాప్ సెకండ్‌కు చేరుకుంటుంది. 

    ఇది కూడా చూడండి: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే?

  • ఇక్కడ మరోవిషయం ఏంటంటే.. ఐదో టెస్ట్‌లో భారత్ గెలిచినా.. శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌ గెలిచినా టీమ్‌ఇండియా అవకాశాలు చేజారినట్లే అవుతుంది. 
  • అంతేకాకుండా ఆసీస్ - భారత్ మధ్య చివరి టెస్టులో భారత్ ఓడిపోయినా.. డ్రాగా ముగిసినా ఫైనల్ రేసు నుంచి టీమిండియా బయటకొచ్చేస్తుంది.
  • చూడాలి మరి చివరి టెస్టులో ఏం జరుగుతుందో?
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు