మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ మధ్య నాలుగు (బాక్సింగ్ డే) టెస్టు నాలుగో రోజు రసవత్తరంగా జరుగుతోంది. అయితే ఈ టెస్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయానికి పాట్ కమిన్స్ అసహనం వ్యక్తం చేశాడు. నాలుగో టెస్టు ప్రారంభంలో ఓవర్‌నైట్ స్కోర్ 358/9తో భారత్ బ్యాటింగ్ కొనసాగించింది. Also Read: రుతుపవనాల సీజన్ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం! అప్పటికి క్రీజులో నితీశ్ కుమార్ రెడ్డి, సిరాజ్ ఉన్నారు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ వేశాడు. స్ట్రైక్‌లో ఉన్న సిరాజ్ డిఫెండ్ చేసే సమయానికి బాల్ ఎడ్జ్ తాకి స్లిప్ చేతికి వెళ్లింది. అయితే ఆ బంతి బ్యాట్‌కు తగిలిన తర్వాత బౌన్స్ అయింది. దీనిని థర్డ్ అంపైర్ చూసి నాటౌట్‌గా పరిగణించారు. Also Read: నాగార్జునాసాగర్ దగ్గర హై డ్రామా..భద్రత విషయంలో గందరగోళం థర్డ్ అంపైర్ కాల్‌పై అసహనం అయితే థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని మరోసారి సరిగ్గా చూడమని పాట్ కమిన్స్ ప్రయత్నించాడు. ఈ మేరకు DRSని కోరాడు. కాల్‌ని మళ్లీ సమీక్షించమని అంపైయర్లకు తెలిపాడు. అయితే థర్డ్ అంపైర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని గ్రౌండ్‌లోని అంపైర్ కమిన్స్‌కు తెలియజేశాడు. అందువల్ల దానిని మళ్లీ సమీక్షించలేమన్నారు. pic.twitter.com/7K1u6svm7G — The Game Changer (@TheGame_26) December 29, 2024 Also Read: కేటీఆర్ కోసం పాట పాడిన కొడుకు..ఉత్తమ బహుమతి అంటూ ఎమోషనల్ దీంతో కమ్మిన్స్ అండ్ టీమ్ థర్డ్ అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం కామెంటరీ బాక్స్‌లో చర్చించబడటంతో.. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆతిథ్య జట్టు అంపైర్‌లను ప్రభావితం చేయగలదని అన్నాడు. గతంలో 2008లో కూడా అలానే జరిగిందని తెలిపాడు. ముందుగా గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. నేను ఇంతకు ముందెన్నడూ ఇలాంటిది చూడలేదు. థర్డ్ అంపైర్ల నిర్ణయాన్ని కమిన్స్ మళ్లీ సమీక్షించాలనుకుంటున్నాడు. ఆ విషయాన్నే అంపైర్లతో చెబుతున్నాడు. దీన్ని చాలా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను అని గిల్‌క్రిస్ట్ ప్రసారంలో పేర్కొన్నాడు. Also Read: రామాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన విగ్రహాలు ఇన్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు Banter alert! 😁🫡When #PatCummins called for a review, #IrfanPathan delivered a cheeky response that hit right on target! 🙌🏻#AUSvINDOnStar 👉 4th Test, Day 4, LIVE NOW! pic.twitter.com/Y8nnH7n7Fx — Star Sports (@StarSportsIndia) December 29, 2024 భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆస్ట్రేలియాను జట్టు అంపైర్‌లను ప్రభావితం చేయగలదని అన్నాడు. 2007-08లో ఆస్ట్రేలియా పర్యటనలో భారతదేశానికి వ్యతిరేకంగా అనేక అంపైరింగ్ నిర్ణయాలు జరిగాయన్నారు. అప్పట్లో ఆండ్రూ సైమండ్స్ బ్యాట్‌కు క్లియర్‌గా బాల్ తగిలినా ఔట్ కాలేదన్నాడు. మరోవైపు, బంతి తన బ్యాట్‌కు తాకనప్పటికీ భారత ఆటగాడు యువరాజ్ సింగ్ ఔటయ్యాడన్నారు. ఇలా మరిన్ని ఉదాహరణలు చెప్పాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.