IND VS ENG : కోహ్లీకి గాయం.. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలింగ్‌

భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. హర్షిత్‌ రాణా, యశస్వి జైస్వాల్‌ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. కోహ్లీ కుడి మోకాలి నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌ ఆడటం లేదు.  

New Update
eng vs ind 1st

eng vs ind 1st

ఇంగ్లండ్,ఇండియా (ENG v/s IND) జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం అయింది.  గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా తొలివన్డే మొదలైంది.  ముందుగా టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో టీమిండియా (Team India) బౌలింగ్‌ చేయనుంది.  ఈ మ్యాచ్ తో టీమిండియా తరుపున హర్షిత్‌ రాణా, యశస్వి జైస్వాల్‌ వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ యశస్వికి క్యాప్ ఇవ్వగా, మహమ్మద్ షమీ హర్షిత్ రాణాకు క్యాప్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli) కుడి మోకాలి నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌ ఆడటం లేదు.  

Also Read :  మెగా బ్రదర్ నాగబాబు నివాసంలో విషాదం.. ఎమోషనల్ ట్వీట్ వైరల్!

Also Read :  ఫోన్ కోసం రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకు దూకిన విద్యార్థి

జట్లు ఇవే

టీమిండియా జట్టు :  రోహిత్‌ (కెప్టెన్‌), యశస్వి, శ్రేయస్, శుభ్‌మన్, రాహుల్‌, హార్దిక్, అక్షర్‌ పటేట్‌, జడేజా, హర్షిత్‌ రాణా, కుల్‌దీప్‌ యాదవ్, షమి.

ఇంగ్లండ్‌ జట్టు : డకెట్, సాల్ట్, రూట్, బ్రూక్, బట్లర్‌ (కెప్టెన్‌), లివింగ్‌స్టన్, బెతెల్, బ్రైడన్‌ కార్స్, ఆర్చర్, అడిల్‌ రషీద్, సకిబ్‌ మహమూద్‌. 

Also Read :  ఏపీలో దారుణం.. పామాయిల్ తోటలో పంచాయితీ.. కొడవలితో భార్య గొంతు కోసి..!

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటివరకు 107 వన్డేలు జరగగా ఇందులో టీమిండియా 58 మ్యాచులు, ఇంగ్లండ్ 44 మ్యాచుల్లో విజయం సాధించాయి.  రెండు  మ్యాచ్‌లు టై అవ్వగా మరో మూడు  రద్దయ్యాయి. స్వదేశంలో 52 మ్యాచులు జరగగా భారత జట్టు 34 విజయాలు సాధించింది. ఇవాళ తొలి వన్డే జరిగే నాగ్‌పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. 

Also Read :  ఇలా చేశావ్ ఏంటీ భయ్యా :  ఆసీస్కు బిగ్ షాక్..  స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు