/rtv/media/media_files/2025/02/18/gvDk0L5ET8u4btT6AvzA.jpg)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy 2025) టీమిండియా (Team India) న్యూజెర్సీని విడుదల చేసింది. కొత్త జెర్సీతో కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ కెమెరాలకు పోజులిచ్చారు. అయితే భారత జట్టు జెర్సీపై ఆతిథ్య దేశం పాకిస్తాన్ పేరు కూడా ముద్రించబడి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. వాస్తవానికి టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ పేరుతో ఉన్న జెర్సీలను భారత్ ధరించదని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఐసీసీ మార్గదర్శకాలకు భారత జట్టు కట్టుబడి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. ఇటీవలి కాలంలో భారత జెర్సీపై పాకిస్తాన్ పేరు ముద్రించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2023 ఆసియా కప్ పాకిస్తాన్‌లో జరిగినప్పుడు కూడా ఏ జట్ల జెర్సీపై ఆతిథ్య జట్టు పేరు లేదు.
Also Read : కేంద్ర ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే..!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి భారత్ ఏ ఒక్క మ్యాచ్ కూడా పాకిస్తాన్ లో ఆడటం లేదు. కానీ ఐసీసీ మార్గదర్శకాలను పాటిస్తూ జెర్సీలో అతిథ్య జట్టు పేరును ముద్రించింది. కానీ పాక్ మాత్రం ఐసీసీ మార్గదర్శకాలను పాటించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 7 దేశాల జెండాలను కరాచీ నేషనల్ స్టేడియం పైన ఎగురవేసింది పీసీబీ బోర్డు. కానీ ఇందులో భారత త్రివర్ణ పతాకం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక దేశం ఓ టోర్నమెంట్‌ను నిర్వహిస్తుంటే, ఆ టోర్నమెంట్‌లో పాల్గొనే అన్ని దేశాల జెండాలను ఎగురవేయాలి. కానీ పాక్ ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసిందని చెప్పాలి.
Also Read : అమెరికాలో ఉద్రిక్తతలకు తెర పడనుందా...రష్యా ఏమంటుందంటే!
ఇక ఛాంపియన్స్ ట్రోఫీ రేపటి నుంచి అంటే 2025 ఫిబ్రవరి 19నుంచి మొదలు కానుంది. మొదటి మ్యాచ్ పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 20న భారత జట్టు బంగ్లాదేశ్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. పాక్, భారత్ జట్ల మధ్య ఫిబ్రవరి 23వ తేదీన మ్యాచ్ జరగనుంది.
Captain Rohit Sharma in today's photo shoot for champions trophy.📸❤️
— Deepak (@Elvishfan2881) February 17, 2025
The Captain coming for CT @ImRo45 🐐 #RohitSharma #iccchampionstrophy2025 pic.twitter.com/6Iff8UBLX1
Also Read : ఆ రాశుల వారికి ఈరోజు అసలు బాలేదు- తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు
ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్...
ఫిబ్రవరి 19 - పాకిస్తాన్ vs న్యూజిలాండ్, కరాచీ
ఫిబ్రవరి 20 - బంగ్లాదేశ్ vs ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 21 - ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా, కరాచీ
ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 23 - పాకిస్తాన్ vs ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 24 - బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి
ఫిబ్రవరి 25 - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, రావల్పిండి
ఫిబ్రవరి 26 - ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 27 - పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి
ఫిబ్రవరి 28 - ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, లాహోర్
మార్చి 1 - దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, కరాచీ
మార్చి 2 - న్యూజిలాండ్ vs ఇండియా, దుబాయ్
మార్చి 4 - సెమీ-ఫైనల్-1, దుబాయ్
మార్చి 5 - సెమీ-ఫైనల్-2, లాహోర్
మార్చి 9 - ఫైనల్, లాహోర్ (భారత్ ఫైనల్‌కు చేరుకుంటే దుబాయ్‌లో ఆడతారు)
మార్చి 10 - రిజర్వ్ డే
Also Read : Canada: కెనడాలో బోల్తాపడ్డ విమానం..18మందికి తీవ్రగాయాలు