/rtv/media/media_files/2025/02/21/GfhTaamF6BQhP23Quvez.jpg)
వన్డేల్లో అత్యధిక క్యాచులు అందుకున్న భారత ప్లేయర్‌గా అజారుద్దీన్(156) పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ లిస్టులో జయవర్ధనే (218), పాంటింగ్ (160) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. మూడో స్థానంలో అజారుద్దీన్, కోహ్లీ ఉన్నారు. విరాట్ 295 ఇన్నింగ్స్‌లలో, అజారుద్దీన్ 332 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించారు. వన్డేల్లో కేవలం ఐదుగురు భారత ఆటగాళ్లు మాత్రమే 100 క్యాచ్‌లు పట్టారు.
Virat Kohli equals Mohammad Azharuddin’s record for most catches in ODIs for india!
— khabresh (@khab_resh) February 20, 2025
A testament to his sharp reflexes and incredible fielding skills
Also Read : తాజ్‌బంజారా హోటల్ సీజ్
వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు:
విరాట్ కోహ్లీ 156*
మొహమ్మద్ అజారుద్దీన్ 156
సచిన్ టెండూల్కర్ 140
రాహుల్ ద్రవిడ్ 124
సురేష్ రైనా 102
యాక్టివ్ క్రికెటర్లలోకోహ్లీ తరువాత రోహిత్ శర్మ 96 క్యాచ్‌లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడు కూడా కోహ్లీ. వన్డే ఫార్మాట్‌లో 14 వేల పరుగులు చేసి.. ప్రపంచంలోనే మూడవ క్రికెటర్‌గా నిలిచాడు.
ఇక బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో మహ్మద్ షమీ రికార్డు క్రియేట్ చేశాడు. అత్యంత వేగంగా 200 వికెట్లను తీసిన బౌలర్‌గా నిలిచాడు. షమీ 5 వేల 126 బంతుల్లో ఈ మార్క్‌కు చేరుకోగా.. మిచెల్ స్టార్క్ 5 వేల240 బంతుల్లో పడగొట్టాడు.
Also Read : ఐదుసార్లు ఎమ్మెల్యే, ప్రజా ఉద్యమకారుడు..కానీ అవమానించారు
Fewest balls to 200 ODI wickets
5126 మహ్మద్ షమీ
5240 మిచెల్ స్టార్క్
5451 సక్లెయిన్ ముష్తాక్
5640 బ్రెట్ లీ
5783 ట్రెంట్ బౌల్ట్
5883 వకార్ యూనిస్
Also Read : కొడుకుకి ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారం..కానీ ఇంతలోనే తండ్రి..!
Fastest Indians to 200 ODI wickets
మహ్మద్ షమీ (104 వన్డేలు)
అజిత్ అగార్కర్ (133 వన్డేలు)
జహీర్ ఖాన్ (144 వన్డేలు)
జవగల్ శ్రీనాథ్ (147 వన్డేలు)
కపిల్ దేవ్ (166 వన్డేలు)
Also Read : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!