IND vs PAK : పాకిస్థాన్కు బిగ్ షాక్ ..కీలక ప్లేయర్ ఔట్!

పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది.  స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్ ఈ  మ్యాచ్ కు దూరమవుతున్నట్లుగా తెలుస్తోంది. కంటి దురద కారణంగా బాబర్  నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు హాజరుకాలేదు. దీంతో భారత్ తో ఇవాళ జరగబోయే మ్యాచ్ ఆడేది అనుమానంగా మారింది.

New Update
babar azam

క్రికెట్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 23) మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌కు కూడా ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైంది.  ఈ క్రమంలో పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది.  స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్ ఈ  మ్యాచ్ కు దూరమవుతున్నట్లుగా తెలుస్తోంది. కంటి దురద కారణంగా బాబర్  నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు హాజరుకాలేదు. దీంతో భారత్ తో ఇవాళ జరగబోయే మ్యాచ్ ఆడేది అనుమానంగా మారింది. కాగా ఇప్పటికే వెన్నునొప్పి కారణంగా ఆ జట్టు ఓపెనర్ ఫఖర్ జమాన్ టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబర్ కూడా ఆడకపోతే పాకిస్థాన్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బే అనే చెప్పాలి.  

పాకిస్థాన్ కు డు ఆర్ డై మ్యాచ్. 

ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ చేతిలో తొలి మ్యాచ్ ఓడిన పాకిస్తాన్ జట్టుకు ఇది డు ఆర్ డై మ్యాచ్ అనే చెప్పాలి. భారత్ పై కచ్చితంగా విజయం సాధించాలి.  భారత్  చేతిలో ఓడిపోతే కనుక ఈ టోర్నమెంట్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకోవడం చాలా కష్టం అవుతుంది. భారత జట్టు పాకిస్థాన్‌ను చిత్తు చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్స్‌కు అర్హత దాదాపుగా ఖాయమవుతుంది.  ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే న్యూజిలాండ్ జట్టుపై గెలవాల్సి ఉంటుంది.  ఇది రన్ రేట్ పై కూడా ఆధారపడి కూడా ఉంటుంది.  

జట్ల అంచనా..  

భారత్ :   రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ. 

పాకిస్థాన్ : బాబర్ అజామ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ ఆఘా (వైస్-కెప్టెన్), తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, అబ్రార్ అహ్మద్, హరిస్ రౌఫ్, నసీమ్ షా, షహీన్ షా అఫ్రిది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు