Rythu Bharosa: రైతు భరోసాపై మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన! తెలంగాణలో రైతు భరోసా అమలుపై ఉప మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించి, శాసన సభ్యులతో చర్చించి, వారి సమ్మతితోనే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమది ప్రజా ప్రభుత్వం కాబట్టే ఇలా చేస్తున్నామన్నారు. By srinivas 28 Jul 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Telangana: రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయాలు సేకరించిన తర్వాతే శాసన సభ్యులతో చర్చించి వారి సమ్మతి మేరకు రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. శాసన మండలి బడ్జెట్ పై చర్చలో భాగంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బడ్జెట్ లో రైతాంగానికి ప్రాధాన్యత.. ఈ మేరకు రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తున్నామని, ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పుంటే వేలెత్తి చూపాలన్నారు. లోపాలుంటే తప్పకుండా సరిచేసుకుంటాని చెప్పారు. ఇక బడ్జెట్ లో రైతాంగానికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పిన భట్టి.. రైతు రుణమాఫీ కొనసాగిస్తామన్నారు. విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంతో విద్యా శాఖను అట్టిపెట్టుకున్నారని తెలిపారు. ఇక చేనేత పరిశ్రమను ఆదుకుంటాం. బతుకమ్మ చీరలతోనే కాకుండా హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు తదితరాలకు ఉపయోగించుకుంటాం. ధరణి సమస్యలు పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తోందని చెప్పారు. ఇది కూడా చదవండి: Maoist: నేటినుంచి మావోయిస్టు వారోత్సవాలు.. ఆ ప్రాంతాలను జల్లెడ పడుతున్న పోలీసులు! ఇక చిన్న రైతుల కోసం పథకాల రూపకల్పనకు ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. ప్రజలతో చర్చించి పథకాలు అమలు చేయడమే లక్ష్యమని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా పథకాలకు ఇప్పటివరకు చేస్తున్న ఖర్చు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రాబోయే రోజుల్లో పెరుగుతున్న బడ్జెట్‌పై సమీక్ష చేశారు. ఆయిల్ ఫామ్ సాగులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై మాట్లాడారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న నేతన్న చేయూత, నేతన్న భీమా పథకాలు ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా తదితర అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తర్వాత చేనేత కార్మికుల జీవితాల్లో వచ్చిన మార్పులపై విచారించారు. #rythu-bharosa-in-telangana #bhatti-vikramarka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి