మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్

గోడౌన్‌లో రేషన్ బియ్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. అతనితో పాటు తన కుమారుడుకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల్లోగా విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు.

New Update
Perni nani

Perni nani Photograph: (Perni nani)

వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. గోడౌన్‌లో రేషన్ బియ్యం కేసులో నానితో పాటు అతని కుమారుడు కిట్టుకు పోలీసులు నోటీసులు పంపారు. నోటీసులు ఇవ్వడానికి పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్లగా.. ఎవరూ లేరు. దీంతో ఇంటి తలుపులకు పోలీసులు నోటీసులు అంటించారు. నిందితులుగా పేర్ని నానితో పాటు అతన భార్య జయసుధ, ఆమె పీఏ మానస తేజ పేర్లు కూడా చేర్చారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల్లోగా పోలీస్ స్టేషన్‌కు రావాలని పోలీసులు నోటీసులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్

గోడౌన్ రేషన్ బియ్యం కేసులో పేర్ని నాని భార్య పీఏ మానస తేజ కూడా ఉన్నారు. అయితే పీఏ మానస తేజ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే మానస తేజ కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి

కేసు ఏంటంటే?

ఏపీలోని రేషన్ బియ్యంలో అక్రమాలు జరిగాయని అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లా బందరులో కోటి రుపాయల రేషన్ బియ్యం అక్రమం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని, అతని భార్య జయసుధ, పీఏ మానస తేజ కార్యదర్శిపై కూడా కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వం ఉన్న సమయంలో నాని సతీమణి పేరు మీద గోడౌన్ నిర్మించి సివిల్ సప్లయిర్లకు అద్దెకు ఇచ్చారు. ఈ సమయంలోనే రేషన్ బియ్యం అక్రమాలు చేసినట్లు పేర్ని నానిపై తీవ్రంగా ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇది కూడా చూడండి: TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకూ తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు

ఇది కూడా చూడండి: పీఎఫ్ నిధుల మోసం కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు