GOAT Tour: అభిమానుల కోసం కాదు...అధికారుల కోసం...మెస్సీ టూర్ వీడియోలు వైరల్

కోలకత్తాలో మెస్సీ టూర్ ఘోరంగా ఫెయిల్ అయింది. కేవలం పదంటే పది నిమిషాలే గ్రౌండ్ లో ఉండటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికారుల టూర్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు.

New Update
goat tour

భారత్ లో గోట్మెస్సీ టూర్ మొదలైంది. కోలకత్తాలో ముగిసిపోయింది కూడా. దీనిపై మెస్సీ ఫ్యాన్స్(Fans Angry at Messi Event in Kolkata) తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. కోలకత్తాలోమెస్సీ(Lionel Messi) మ్యాచ్ ఆడకుండానే స్టేడియం నుంచి వెళ్లిపోవడంతో అభిమానుల్లో ఆగ్రహం తెప్పించింది. స్టేడియంలో ఉన్న కుర్చీలు, ఫ్లెక్సీలు ధ్వంసం చేయడంతో పాటు వాటర్ బాటిళ్లు మైదానంలోకి విసిరేశారు. కొంతమంది బారికేడ్లు దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ, ఈవెంట్ నిర్వహణ లోపాన్ని అంగీకరించి, మెస్సీకి, అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. మరోవైపు, ఈ పర్యటన ఏర్పాట్ల గందరగోళంపై రాష్ట్ర గవర్నర్ సీరియస్ అయ్యారు. నిర్వహణ లోపాలపై బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. సీఎం విచారణ కమిటీని కూడా వేశారు.

Also Read :  ఇమ్రాన్ ఖాన్ కోసం ఆయన భార్య ఎలాన్ మస్క్ కు బహిరంగ లేఖ

వీఐపీ పవర్ ప్లే..

మెస్సీకోలకత్తా టూర్ వీడియోలతో అభిమానులు సఓసల్ మీడియాను నింపేస్తున్నారు. మెస్సీ మ్యాచ్ విషయంలో వీఐపీ పవర్ ప్లే ఫ్యాన్స్ ను ఎల నిరాశ పర్చిందో చెబుతున్నారు. అధికారులు ఫొటోలు తీసుకోవడంతోనే సరిపోయింది..ఇక అభిమానులకు ఛాన్స్ ఎక్కడిదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుట్ బాల్ స్టార్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీస్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు మాత్రమే ఫోటోలు తీసుకున్నారు వారి తాపత్రయమే సరిపోయింది. ఉన్న పదినిమిషాలు కూడా వీఐపీ క్రౌడ్చుట్టుముట్టేశారు. అభిమానులకు అవకాశమే దక్కలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చేతిలో అభిమానులు ఓడిపోయారు అంటూ సోషల్ మీడియాను పోస్ట్ లతోనింపేస్తున్నారు.

Also Read :  మయన్మార్ లో ఉద్రిక్తతలు.. ఆసుపత్రిపై దాడిచేసిన సైన్యం.. 31 మంది మృతి

ఎవరినీ కలవకుండానే..

కోలకత్తాలోనేసాల్ట్ లేక్ లో షారుఖ్, సౌరవ్ గంగూలీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవడానికి ముందు అతను స్టేడియం చుట్టూ ఒక రౌండ్ వేయాల్సి ఉంది. కానీ ఆయన చుట్టూ ప్రమఖులు, రాజకీయ నాయకులు ఉండడంతో అసలు మెస్సీని అభిమానులు చూడనే లేకపోయారు. దీంతో తీవ్ర నిరాశ చెందిన వారు కుర్చీలు, సీసాలు విసిరేసి గందరగోళం సృష్టించారు. ఫలితంగా మెస్సీ అసలు స్టేడియంలో తిరగకుండా వెళ్ళిపోయారు. షారూఖ్, గంగూలీ, మమతా బెనర్జీలతో కూడా సమావేశం జరగలేదని తెలుస్తోంది. పరిస్థితి అదుపు తప్పుతుందని గుర్తించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. మెస్సీ టీమ్‌ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చివరకు సొరంగ మార్గం ద్వారా మెస్సీ, అతని బృందం స్టేడియం నుంచి బయటకు వెళ్లినట్లు సమాచారం.

వెంట్ మేనేజర్ సతద్రు అరెస్ట్..

మెస్సీ టూర్ విఫలం కావడంతో దీనికి సంబంధించిన ఈవెంట్ మేనేజర్ సతద్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. అదనపు డైరెక్టర్ జనరల్ లా అండ్ ఆర్డర్ జావేద్ షమీమ్ ధృవీకరించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకు సతద్రుని అరెస్ట్ చేశారు. గోట్ టూర్ మొత్తాన్ని ఇతనే నిర్వహించాడు. సతద్రు గతంలో ఫుట్‌బాల్ దిగ్గజాలు పీలే, డియెగోమారడోనాలను భారతదేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. దీని తరువాత రోనాల్టోను కూడా తీసుకు వస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు మెస్సీ టూర్ ఫెయిల్ అయిన తర్వాత ఆ పని చేస్తాడో లేదో కూడా తెలీదు. మరోవైపుమెస్సీ చుట్టూ వీఐపీలు చుట్టుముట్టినప్పుడు సతద్రుచాలాసేపు అతన్ని వదిలేయమని వేడుకున్నాడు. మైక్ లో అందరికీ విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాడు. కానీ సతద్రు మాటను ఎవరూ వినిపించుకోలేదు. దీంతో మొత్తం గోట్ టూరే చెత్త చెత్త అయిపోయింది. 

Advertisment
తాజా కథనాలు