భారతదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు రోజురోజుకి పెరగడం పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు తమిళనాడు మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. చెన్నై నడిబొడ్డున ఉన్న అన్నా యూనివర్సిటీలో ఓ యువతి పై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. Also Read: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ కు ప్రముఖ హీరోయిన్ సపోర్ట్, రేవంత్ పై ఫైర్ నడిబొడ్డున యువతి పై అత్యాచారం పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 23న అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ యువతి రాత్రి యూనివర్సిటీ ప్రాంగణంలో తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు యువకులు.. ఆ అమ్మాయి స్నేహితుడిని గాయపరిచి.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత ఆ యువతిని అసభ్యకరంగా ఫొటోలు తీసి .. తమపై ఫిర్యాదు చేస్తే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ బాధితురాలు ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యూనివర్సిటీ ప్రాంగణంలోని సీసీ కెమెరాల సహాయంతో నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. అతడిని చెన్నై కోట్టూరుపురానికి చెందిన జ్ఞానశేఖరన్ గా గుర్తించారు. జ్ఞానశేఖరన్ రోడ్డు పక్కన బిర్యానీ అమ్ముకునేవాడని సమాచారం. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read: Year Ender2024: తెలుగులో సత్తా చాటిన బాలీవుడ్ బ్యూటీస్.. సౌత్ భామలు కూడా అక్కడ..