వివాదాస్పద మతగురువు, సంత్ ఆశారాం బాపుకు రిలీఫ్ దొరికింది. మార్చి 31 వరకు సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం అతనికి మార్చి 31 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణంగా ఆయరకు ఉపశమనం కల్పించింది. అత్యాచారం కేసులో ఆశారాం బాపు యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. జైలునుంచి బయటకొచ్చాక అనుచరులను కలవకూడదని ధర్మాసనం ఆదేశించింది. ఆశారాంను ఆసుపత్రికి తరలించాలని, చికిత్స కోసం ఎక్కడికి వెళ్లాలో నిర్దేశించవద్దని పోలీసు అధికారులకు సుప్రీం కోర్టు తెలిపింది . ప్రస్తుతం ఆయనకు 85ఏళ్లు. 2023లో తన ఆశ్రమంలో నివసించే మహిళపై అత్యాచారం చేసినందుకు గాంధీనగర్ కోర్టు ఆశారాం బాపును దోషిగా నిర్ధారించింది. ఆశారాం బాపు ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆశారాం కుమారుడు నారాయణ్ సాయిపై కూడా అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసులో సాయికి జీవిత ఖైదు పడింది. అతను సూరత్ జైలులో ఉన్నాడు. 2023లో గాంధీనగర్ కోర్టు ఈ కేసులో జీవిత ఖైదును సస్పెండ్ చేయాలంటూ ఆశారాం బాపు వేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు గత ఏడాది ఆగస్టులో తిరస్కరించింది. 16 ఏళ్ల బాలిక ఫిర్యాదు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపించింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశారామ్‌పై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగినట్లు బాధితురాలు వెల్లడించడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. మరోవైపు ఈ ఆరోపణలను ఆశారామ్‌బాపూ ఆశ్రమ ప్రతినిధి నీలమ్ దూబే తోసిపుచ్చారు. Also Read : గరికపాటి అలాంటోడా... సంచలన ఆరోపణలు చేసిన మొదటి భార్య