Putin-Modi Meeting: దేశాధినేతల మధ్యలో ఎర్రమొక్క..ఏంటి దీని స్పెషాలిటీ?

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనలో చాలా విశేషాలే చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి పుతిన్, ప్రధాని మోదీ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎర్రమొక్క. అసలేంటీ మొక్క, దాన్ని అక్కడ ఎందుకు పెట్టారు. 

New Update
helicona

భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజులు ఇక్కడ ఉన్నారు. అందులో రెండవ రోజు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ హౌస్ లో ఒక ప్రత్యేక మైన హాల్ లో ఇరుదేశాధినేతల సమావేశం ఏర్పాటు చేశారు.  మొత్తం ఆ హాల్ లో పుతిన్, మోదీలకు మధ్యలో ఒక ఎర్ర మొక్క ప్రత్యేకంగా కనిపించింది. కాస్త పసుపు రంగును కలగలుపుకుని ఎరుపు రంగుతో ఉ్న ఆ మొక్క చాలా ప్రత్యేకమైనదని తెలుస్తోంది. దాన్ని కావాలనే ఇరు నేతల మధ్యలో వచ్చేట్టుగా పెట్టారని చెబుతున్నారు.  

ఒక పద్ధతి ప్రకారం..

మామూలుగా అత్యున్నత స్థాయి దౌత్య సమావేశాలు, దేశాధినేతల చర్చల కోసం సిద్ధం చేసే హాల్స్ లో అన్నీ ప్రత్యేకంగా ఉండేటట్టు చూసుకుంటారు. సీటింగ్ అరేంజ్ మెంట్, ఆ గదిలో పెట్టే పువ్వులు, బ్యాగ్రౌండ్ అన్నీ చాలా జాగ్రత్తగా ఒక థీమ్ ప్రకారం అమరుస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్..భారత్ కు చాలా కావాల్సిన మనిషి. ప్రధాని మోదీకి మంచి స్నేహితుడు కూడా. దాంతో పాటూ భారత్, రష్యాల మధ్య స్నేహం చాలా ఏళ్ళుగా కొనసాగుతూ వస్తోంది. అలాగే అమెరికా ఆంక్షల నేపథ్యంలో పుతిన్ భారత్ రాక చాలా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ప్రపంచ దేశాలన్నీ పుతిన్, మోదీ భేటీపైనే దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో భేటీ జరిగిన ప్రదేశాన్ని మరింత శ్రద్ధగా అలంకరించారు. ఒక అర్థం వచ్చే విధంగా ఉంచారు. 

సానుకూల శక్తి..

పుతిన్, ప్రధాని మోదీ మధ్యలో కనిపిస్తున్న మొక్క పేరు హెలికోనియా. సానుకూల శక్తికి సూచికగా దీన్ని వాడతారు అని తెలుస్తోంది. వృద్ధి, శ్రేయస్సు, సమతుల్యత, సామరస్యాలతో పాటు కొత్త ఆరంభాలు, ముందడుగులకు శుభ పరిణామంగా ఈ మొక్కను భావిస్తారు. అందుకే ఈ మొక్కను ఇరు దేశాధినేతల సమావేశంలో పెట్టి ఉంటారని చెబుతున్నారు. దీంతో భారత్, రష్యాల మధ్య గొప్ప బంధాన్ని మరింత చాటి చెబుతూ ప్రపంచ దేశాలకు బలమైన సందేశాన్ని ఇచ్చినట్లయిందని అంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు