భారత్ లో చైనా వైరస్ HMPV విజృంభిస్తోంది. రెండు రోజుల్లో 7 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లకు, హాస్పిటళ్లకు గైడ్ లైన్స్ జారీ చేసింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ లో కేసుల సంఖ్య పెరుగుతుంది. జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరం, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరిన వారికి HMPV టెస్టులు చేస్తున్నారు. పెరుగుతున్న కేసుల సంఖ్య ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇండియాలో HMPV వ్యాప్తి పై WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చెన్నైలో పుట్టిన ఈమె 2019 నుంచి 2022 వరకు WHOలో ప్రధాన శాస్త్రవేత్తగా పని చేశారు. Also Read : Horoscope Today: కెరీర్‌లో ఈ మూడు రాశుల వారికి నేడు తిరుగే లేదు ఇండియాలో హ్యూమన్ మెటాప్న్యూమో కేసులు ఇంతకుముందు నుంచే వ్యాప్తి చెందుతున్నాయని WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. HMPV టెస్టులు చేసిన వారిలో 3శాతం పాజిటీవ్ అని తేలుతుందని ఆమె అన్నారు. చలితీవ్రత పెరుగుతున్న కారణంగా వైరస్ వ్యాప్తి కూడా వేగంగా విస్తరిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. వైరస్ సోకిన వారి టెస్ట్ శాంపిల్స్ నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అన్నీ రాష్ట్రాలు ఈ చైనా వైరస్ పై అప్రమత్తం అయ్యాయి. ఇది కూడా చదవండి : HMPV వైరస్ ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో ఐసోలేషన్ సెంటర్లు ఓపెన్ HMPV లక్షణాలు ఇవే హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ సాధారణంగా ఫ్లూ లేదా జలుబు లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ వైరస్ ఉన్నవారు దగ్గిన, తుమ్మిన, శారీరక సంబంధాల ద్వారా ఇతరులకు సోకుతుంది. మొదట దగ్గు, కొద్దిపాటి జ్వరం వస్తుంది. ఆ తర్వాత జలుబు, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడతారు. ఈ వైరస్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా శుభ్రత పాటించాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు క్లాత్ అడ్డంగా పెట్టుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్ ధరించాలి. ఇది కూడా చూడండి: అస్సాం బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి Also Read : సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా..