/rtv/media/media_files/2026/03/18/pmuy-scheme-2026-03-18-16-33-24.jpg)
ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్‌లో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు ఖాళీ సిలిండర్లతో గ్యాస్ కేంద్రాలకు చేరుకుని రీఫిల్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. దేశ వ్యాప్తంగా అర్హులైన మహిళలకు ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ పథకం ద్వారా ‘ఉచిత గ్యాస్ కనెక్షన్’ అందిస్తుంది. అంతేకాకుండా మొదటి సిలిండర్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో పాటు మరెన్నో అద్భుతమైన ప్రయోజనాలను కూడా పొందొచ్చు. ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Pradhan Mantri Ujjwala Yojana - PMUY
కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ పథకాన్ని మే 1, 2016లో ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ప్రారంభించింది. కట్టెల పొయ్యి వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మహిళలను రక్షించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథంలో భాగంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 12 కోట్లకు పైగా కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందించారు. మొదటి దశలో 10 కోట్ల కనెక్షన్లు, రెండో దశలో 2.34 కోట్ల కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
PM Ujjwala Yojana 2.0 Scheme
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు PM Ujjwala Yojana 2.0 Scheme ద్వారా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. 2026 నాటికి మరింత మందికి ఈ సేవలను అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో డిపాజిట్ ఫ్రీ కనెక్షన్‌తో పాటు మరెన్నో వెసులుబాటులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
PMUY 2.0 Scheme Benefits
- గ్యాస్ కనెక్షన్ కోసం ఎలాంటి సెక్యురిటీ డిపాజిట్ చెల్లించాల్సిన పనిలేదు.
- మొదటి సారిగా కనెక్షన్ తీసుకునే వారికి గ్యాస్ సిలిండర్ రీఫిల్, స్టవ్ రెండూ పూర్తిగా ఫ్రీ.
- ప్రతి సిలిండర్‌ను రీఫిల్ చేసేటప్పుడు రూ.300 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ తగ్గింపుతో కేవలం రూ.550 నుండి రూ.600 చెల్లించి సిలిండర్ పొందవచ్చు.
Free Gas Connection Eligibility Criteria
- ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే ఉద్దేశించబడింది.
- 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క మహిళ అర్హులే.
- దరఖాస్తుదారు పేరుమీద ఇంట్లో వేరే గ్యాస్ కనెక్షన్ ఉంటే ఈ పథకం వర్తించదు.
- షెడ్యూల్ కులాలు, తెగలకు చెందినవారై ఉండాలి.
- దరఖాస్తుదారు కచ్చితంగా రేషన్‌కార్డు కలిగి ఉండాలి.
- 14 పాయింట్ల డిక్లరేషన్‌పై సంతకం చేయాలి.
Required Documents for Application
ఈ పథకం కోసం అప్లై చేసుకునే మహిళలు కొన్ని డాక్యుమెంట్లు కలిగి ఉండాలి.
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- బ్యాంక్ పాస్ బుక్ అండ్ IFSC కోడ్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- కాస్ట్ సర్టిఫికేట్ (కుల ధృవీకరణ పత్రం)
How to Apply Online for Ujjwala 2.0
ఈ పథకానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- మొదటిగా https://pmuy.gov.in/ అధికారిక వెబ్ సైట్‌ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో 'Apply for New Ujjwala 2.0 Connection' ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
- తర్వాత నచ్చిన కంపెనీని ఎంచుకోవాలి. (Indane, Bharat Gas, or HP Gas).
- మొబైల్ నెంబర్, వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
- తర్వాత ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి.
- కావాల్సిన డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ ఫామ్‌ను ప్రింట్ తీసుకుని దగ్గర్లోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద ఇవ్వాలి.
Follow Us