Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో నక్సల్స్‌ మెరుపు దాడి చేశారు. సుక్మా జిల్లాలోని మారుమూల అడవి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ స్థావరాన్ని భద్రపరుస్తుండగా నక్సల్స్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవన్లలు గాయపడ్డారు.

New Update
Naxals

Naxals Photograph

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో నక్సల్స్‌ మెరుపు దాడి చేశారు. సుక్మా జిల్లాలోని మారుమూల అడవి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ స్థావరాన్ని భద్రపరుస్తుండగా నక్సల్స్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లలు గాయపడ్డారు. ఆదివారం సైనికులు ఏర్పాటు చేసిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన గోమ్‌ గూడ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ దగ్గర ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

ఇద్దరు జవాన్లకు గాయాలు:

ఇది కూడా చదవండి: చిన్న పండుతో గర్భిణులు, పిల్లలకు ఎంతో మేలు

ఎఫీఓబీ పారామిలిటరీ దళంలోని 241వ బెటాలియన్‌కు చెందినది. ఇది చింతల్నార్ పీఎస్‌ పరిధిలో ఉంది. నక్సల్స్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఫోర్స్‌లోని స్పెషలైజ్డ్ జంగిల్ వార్‌ఫేర్ యూనిట్, కోబ్రా, బెటాలియన్ నంబర్ 206కి చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని అధికారులు  వెల్లడించారు. వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.ప్రస్తుతం ఇద్దరి జావన్ల  ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

ఈ కాల్పుల్లో బలగాలు సమర్ధవంతంగా ప్రతీకారం తీర్చుకున్నాయని అధికారులు అంటున్నారు. రాజధాని రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ బస్తర్‌ నిర్దేశిత ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ మావోయిస్టులను ఎదుర్కోవడానికి వారిని CRPF నిరంతరం అడవి ప్రాంతాలలో ఎఫీఓబీలను ఏర్పాటు చేస్తోంది. రెండేళ్లలో ఛత్తీస్‌గఢ్‌లో 40కిపైగా FOBలను స్థాపించింది. 2026 మార్చి నాటికి దేశం నుంచి నక్సల్స్ విధ్వంసాన్ని అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మావోయిస్టులపై గట్టి నిఘా పెట్టారు అధికారులు.

ఇది కూడా చదవండి: ఒక్క పండు చాలు.. ఎన్నో వ్యాధులకు ఔషధం



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు