Maoist: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ప్రభాకర్ అరెస్ట్.. వందల్లో నేరాలు!

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 40 సంవత్సరాలుగా అంతుచిక్కుకుండా తిరుగుతున్న ప్రభాకర్ అలియాస్ బాలమూరి నారాయణరావును కంకేర్‌లోని అంతఘర్ అడవుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ప్రభాకర్‌పై రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.

author-image
By srinivas
New Update
maoist prabhakar

మావోయిస్టు ప్రభాకర్ అలియాస్ బాలమూరి నారాయణరావు

Maoist: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 40 సంవత్సరాలుగా అంతుచిక్కుకుండా తిరుగుతున్న ప్రభాకర్ అలియాస్ బాలమూరి నారాయణరావును కంకేర్‌లోని అంతఘర్ అడవుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ప్రభాకర్‌పై రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.

గణపతి బంధువు..

ఈ మేరకు తెలంగాణలో జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామానికి చెందిన ప్రభాకరరావు గత 40 సంవత్సరాలుగా నక్సల్ సంస్థలో చురుకుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 1984లో నక్సల్ సంస్థలో పార్టీ సభ్యునిగా రిక్రూట్ అయిన ఆయన.. అంతేకాదు ప్రభాకరరావు CCM కార్యదర్శి గణపతి బంధువుగా గుర్తించారు. సీనియర్ మావోయిస్టు క్యాడర్ చెందిన ప్రభాకర్ SZCM ర్యాంక్ నక్సలైట్‌ గా గుర్తింపు పొందినట్లు వెల్లడించారు. యాక్టివ్ నార్త్ సబ్ జోనల్ బ్యూరోలో లాజిస్టిక్స్ సప్లై, MOPOS టీమ్ ఇంఛార్జ్ గా పనిచేస్తున్నారని, అరెస్టైన టాప్ నక్సలైట్ ప్రభాకర్ రావుపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో పాటు అనేక ఇతర రాష్ట్రాల్లో డజన్ల కొద్దీ నేరాలు నమోదైనట్లు తెలిపారు. లాజిస్టిక్ సప్లై, లాజిస్టిక్ ఇంచార్జ్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన మావోయిస్టు అగ్ర నాయకుల సన్నిహిత సహచరుడుగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: విద్యార్థులకు బిగ్ షాక్.. ఈ తరగతులు ఫెయిల్ అయితే మళ్లీ అదే క్లాస్!

మొత్తం 884 మంది మావోయిస్టులు అరెస్టు..

గత కొన్ని రోజులుగా జిల్లా కంకేర్ ప్రాంతంలో ప్రభాకర్ రావు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. సమాచాం అందగానే నిఘా పోలీసు విభాగం పక్కాగా ప్లాన్ చేసి పట్టుకుంది. ప్రభాకర్ రావును విచారిస్తూ ముందస్తు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. బస్తర్ డివిజన్ పరిధిలో 2024లో ఇప్పటివరకు మొత్తం 884 మంది మావోయిస్టు క్యాడర్‌లను అరెస్టు చేసినట్లు బస్తర్ రేంజ్, జగ్దల్‌పూర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి. సుందర్‌రాజ్ చెప్పారు. ఇక ఈ ఆపరేషన్ లో అమిత్ తుకారాం కాంబ్లే, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాంకేర్, ఐ.కె.ఐలెస్లా, పోలీసు సూపరింటెండెంట్ భానుప్రతాపూర్, సందీప్ పటేల్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంతఘర్ జయప్రకాష్ పర్యవేక్షణలో జరిగినట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Jr NTR: ఎన్టీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదు.. అభిమాని తల్లి ఆవేదన, వీడియో వైరల్

CCM కార్యదర్శి బసవ రాజుకు CCM కె. రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, దేవ్‌జీ అలియాస్ కుమా దాదా, కోసా, సోను, మల్లరాజ రెడ్డి అలియాస్ సంగ్రామంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. DKSZC సభ్యుడు ప్రభాకర్ రావు అలియాస్ బాలమూరి నారాయణరావుపై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. DVC సభ్యురాలు రాజే కాంగే (భార్య) రావుఘాట్ ఏరియా కమిటీకి ఇంచార్జ్ గా పనిచేస్తున్నారని తెలిపారు. 

1984 నుండి నక్సల్ సంస్థలో పార్టీ సభ్యునిగా చేరారు. 1984-1994 మావోయిస్టు సంస్థలో క్రియాశీలకంగా ఉన్నారు. బాలాఘాట్ ప్రాంతంలో (మధ్యప్రదేశ్) 1995-1997 వరకు చురుకుగా పనిచేశారు. 1998-2005 వరకు నార్త్ బస్తర్, కోయిలిబేరా ప్రాంతంలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. 2005-2007లో DKSZC సప్లై టీమ్ & అర్బన్ నెట్‌వర్క్ లో పనిచేశారు. 2007-2008 సంవత్సరంలో మన్పూర్-మొహాలా ప్రాంతంలో ఆ ర్వాత 2008-2024 నుంచి ఇప్పటి వరకు- DKSZC సరఫరా, MOPOS (మొబైల్ పొలిటికల్ స్కూల్) ఇన్‌ఛార్జ్ గా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు వివరించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు