Aircraft Crashes: మరో భారీ ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఫైటర్ జెట్- ఇద్దరు పైలెట్లు!

మధ్యప్రదేశ్‌‌లోని శివపురి సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ అదుపుతప్పింది. వైమానిక దళానికి చెందిన ట్విన్ సీటర్ మిరాజ్ 2000 యుద్ధ విమానం పొలాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఫైటర్‌ జెట్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలెట్లు తీవ్రంగా గాయపడ్డారు.

New Update

Mirage 2000 fighter aircraft

మధ్యప్రదేశ్‌‌లోని శివపురి సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ అదుపుతప్పింది. వైమానిక దళానికి చెందిన ట్విన్ సీటర్ మిరాజ్ 2000 యుద్ధ విమానం పొలాల్లో కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఫైటర్‌ జెట్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలెట్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఆ యుద్ద విమానం నివాస ప్రాంతాల్లో కూలకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు.  

Also Read :  TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!

Also Read :  తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం

వాషింగ్టన్ ప్రమాదంలో 67 మంది

కాగా ఈ మధ్య విమాన ప్రమాదాలు పెరిగిపోయాయి. పలు కారణాల వల్ల విమానాలు కూలిపోవడం, అధిక సంఖ్యలో ప్రయాణికులు మరణించడం జరుగుతున్నాయి. ఇటీవల వాషింగ్టన్‌ డీసీ లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

Also Read :  కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!

అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే అమెరికా ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ హాక్ (H-60) ను వేగంగా ఢీకొట్టింది. వెంటనే సమీపంలోని నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బతకలేదు. విమానంలో ఉన్న 64 మంది. అలాగే హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు మొత్తం 67 మంది అక్కడికక్కడే మరణించారు. అనంతరం 28 మంది మృతదేహాలను గుర్తించగా, 41 మృతదేహాలను నీటిలో నుండి బయటకు తీశారు. 

సౌత్‌ సుడాన్‌ ప్రమాదంలో 20 మంది

ఇది మరువక ముందే సౌత్‌ సుడాన్‌లో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటినట్లు అధికారులు తెలిపారు. ఇలా తరచూ విమాన ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు విడుస్తుండం అందరినీ కలవరపాటుకు గురి చేస్తుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు