Microsoft: కొత్త ఏడాదిలో ఉద్యోగాల కోతలు ప్రారంభమయ్యాయి. మొన్నటి వరకు మాంద్యం భయాలు, ఏఐను కారణంగా చూపి ఖర్చులు తగ్గించుకోవడం అంటూ ఉద్వాసన పలికిన సంస్థలు నేడు టాలెంట్ పేరుతో ఇంటికి పంపేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైంది. Also Read: భక్తులు భారీగా వస్తారని తెలిసి ఎందుకు ఏర్పాట్లు చేయలేదు..Chandrababu పని చేయని వారి పై.. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారి పై ఈ ప్రభావం పడనుందని సమాచారం. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి పేర్కొన్నట్లుగా ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ''మైక్రోసాఫ్ట్ లో మెరుగైన పనితీరు కనబర్చిన ఉద్యోగులను ప్రోత్సహిస్తాం.కొత్త విషయాలు నేర్చుకొనేందుకు, ఎదిగేందుకు ప్రయత్నించేవారికి మేము ఎప్పుడూ తోడుంటాం. పని చేయని వారి పై తగిన చర్యలు తీసుకుంటాం అని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి అన్నారు. Also Read: Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్ మెరుగైన పనితీరు చూపించే వారి సంఖ్యను పెంచుకొనే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ లే ఆఫ్ నిర్ణయం తీసుకుంది. కంపెనీలో మొత్తం ఉద్యోగుల్లో 1 శాతం కంటే తక్కువ మంది పై ఈ ప్రభావం పడనుంది. మైక్రోసాఫ్ట్ లే ఆఫ్ లను ప్రకటించడం ఇదేం తొలిసారి కాదు. 2023 లోనే కంపెనీ దాదాపు 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. ఇది కంపెనీ మ్యాన్ పవర్ లో 5 శాతం మాత్రమే. గతేడాది గేమింగ్ విభాగం నుంచి దాదాపు 2 వేల మందిని తొలగించింది. ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కంపెనీలు తమ వ్యూహాలను అమలు చేయడంలో భాగంగా ఈ ఏడాదిలోనూ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో లే ఆఫ్ లు ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Also Read: Tirupati Stampede పై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి! Also Read: Us:లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు..అగ్నికి ఆహుతైన బైడెన్ కుమారుడి ఇల్లు