/rtv/media/media_files/2026/03/20/tmc-manifesto-2026-03-20-18-06-11.jpg)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, TMC అధినేత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికలకు గాను నేడు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 'బంగ్లార్ జొన్నో దిదీర్ 10 ప్రతిజ్ఞ' (బెంగాల్ కోసం దీదీ 10 వాగ్దానాలు) పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో సంక్షేమం, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీకి మళ్లీ అధికారం కట్టబెడితే.. ఈ పథకాలు అమలు చేస్తామని ఆమె చెప్పుకొచ్చారు.
మమతా బెనర్జీ '10 ప్రతిజ్ఞలు'
లక్ష్మీర్ భండార్ పెంపు: మహిళలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచారు. జనరల్ కేటగిరీ మహిళలకు నెలకు రూ. 1,500 (ఏడాదికి రూ. 18,000), ఎస్సీ/ఎస్టీ మహిళలకు నెలకు రూ. 1,700 (ఏడాదికి రూ. 20,400) అందించనున్నారు.
యువతకు ఉపాధి భృతి: 'బంగ్లార్ యువ-సాథి' పథకం కింద నిరుద్యోగ యువతకు నెలకు రూ. 1,500 చొప్పున ఆర్థిక సాయం.
వ్యవసాయ బడ్జెట్: సాగు రంగానికి రూ. 30,000 కోట్లతో ప్రత్యేక 'అగ్రికల్చరల్ బడ్జెట్'. భూమి లేని రైతులకు కూడా ఆర్థిక సాయం అందజేత.
అందరికీ పక్కా ఇళ్లు: బెంగాల్‌లోని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండేలా చర్యలు.
ఇంటింటికీ తాగునీరు: ప్రతి ఇంటికీ పైపుల ద్వారా స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.
ద్వారే చికిత్స: ప్రతి బ్లాక్ మరియు పట్టణంలో ఏటా ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించి, ప్రజల వద్దకే వైద్య సేవలు తీసుకువెళ్లడం.
విద్యారంగ ఆధునీకరణ: 'బంగ్లార్ శిక్షాయతన్' పేరుతో ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదల.
వాణిజ్య కేంద్రంగా బెంగాల్: ప్రపంచ స్థాయి నౌకాశ్రయాలు, లాజిస్టిక్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి, తూర్పు భారత్ కు బెంగాల్‌ను గేట్‌వేగా మార్చడం.
వృద్ధాప్య పింఛన్లు: అర్హులైన వృద్ధులందరికీ నిరంతరాయంగా పింఛన్ సదుపాయం.
పరిపాలనా సంస్కరణలు: పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్తగా 7 జిల్లాల ఏర్పాటు మరియు పట్టణ స్థానిక సంస్థల విస్తరణ.
VIDEO | West Bengal Assembly Elections 2026: CM Mamata Banerjee (@MamataOfficial), while releasing the TMC manifesto, says, “An unofficial President’s rule has been imposed in Bengal because the BJP knows it will be defeated in the upcoming Assembly polls. Is PM Modi so afraid of… pic.twitter.com/HTTrxeBuRA
— Press Trust of India (@PTI_News) March 20, 2026
బీజేపీపై మమతా ఘాటు విమర్శలు
మేనిఫెస్టో విడుదల సందర్భంగా మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో ప్రస్తుతం 'అప్రకటిత రాష్ట్రపతి పాలన' నడుస్తోందని ఆమె ఆరోపించారు. కేంద్ర సంస్థలను (ED, CBI) ఉపయోగించి తన పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రజలు బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా NRC, జనాభా గణన పేరుతో ప్రజల పౌరసత్వాన్ని తొలగించడానికి కేంద్రం ప్లాన్ చేస్తోందని, దీనిని అడ్డుకోవడానికి తృణమూల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో (ఏప్రిల్ 23, ఏప్రిల్ 29) ఎన్నికలు జరగనున్నాయి.
Follow Us