Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ముచ్చటగా మూడోసారి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నాడు. మహారాష్ట్రలో డిసెంబర్ 5న వాంఖడే స్టేడియంలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. అయితే కొర్పొరేట్ టూ సీఎం వరకూ దేవేంద్ర ఫడ్నవీస్ ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శవంతం. ఫడ్నవీస్ మేధోపరమైన చర్చలకు ప్రసిద్ధి చెందారు. ఆర్థిక విషయాలపై లోతైన అవగాహనతో పార్టీ శ్రేణులకు అతీతంగా గౌరవం సంపాదించుకున్నారు. శాసనసభలో వివిధ విధులు నిర్వహించారు. సబ్జెక్ట్ కమిటీలు, స్టాండింగ్ కమిటీలు, జాయింట్ సెలక్షన్ కమిటీల్లో పనిచేశారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ నుండి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును కూడా అందుకున్న ఫడ్నవీస్ జీవిత ప్రస్థానం గురించి తెలుసుకుందాం. मुर्तिजापूर विधानसभा मतदारसंघातून निवडून आलेले आमदार हरीष पिंपळे यांनी आज श्री देवेंद्र फडणवीस यांची भेट घेत त्यांना शुभेच्छा दिल्या. यावेळी श्री देवेंद्र फडणवीस यांनीही त्यांचे अभिनंदन केले!@Dev_Fadnavis @HarishPimpleMLA#Maharashtra #DevendraFadnavis #MahaYutiWins pic.twitter.com/gnBzRKwt3u — @OfficeOfDevendra (@Devendra_Office) November 28, 2024 భిన్నమైన నేపథ్యం.. ఫడ్నవీస్ మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని మధ్యతరగతి బ్రహ్మణ, ప్రగతిశీల కుటుంబం నుండి వచ్చారు. అతని విద్యా నేపథ్యం విభిన్నమైనది, ఇందులో లా డిగ్రీ, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా ఉన్నాయి. గంగాధర్ ఫడ్నవీస్- సరితా ఫడ్నవిస్ దంపతులకు 1970 జూలై 22న జన్మించిన ఫడ్నవీస్ బ్యాంక్ ఉద్యోగి అమృతా రనడేను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు దివిజా ఫడ్నవీస్ ఉంది. View this post on Instagram A post shared by Devendra Fadnavis (@devendra_fadnavis) రాజకీయ జీవితం.. మొదట ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్ లో కొంతకాలం పనిచేసిన ఫడ్నవీస్.. 1992లో 22 సంవత్సరాల వయస్సులోనే నాగ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అయ్యాడు. కార్పొరేషన్‌కు కౌన్సిలర్‌గా వరుసగా రెండు పర్యాయాలు పని చేశారు. అయితే భారతదేశంలోనే రెండవ అతి పిన్న వయస్కుడైన మేయర్ గా, నాగ్ పూర్ లో అతి పిన్న వయస్కుడైన మేయర్ గా ఎన్నికవడం గమనార్హం. 'మేయర్ ఇన్ కౌన్సిల్'గా రెండుసార్లు ఎన్నికై.. ఆ స్థానంలో పనిచేసిన ఏకైక వ్యక్తి ఇయనే కావడం విశేషం. మహారాష్ట్ర శాసనసభకు వరుసగా ఐదుసార్లు సభ్యునిగా ఎన్నికై ప్రజానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 18వ ముఖ్యమంత్రిగా..భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి వార్డు కన్వీనర్ నుంచి బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. అతను 2020-21లో కేరళ రాష్ట్ర ఇంఛార్జ్, కేరళ, బీహార్, గోవా ఎన్నికల ఇంచార్జ్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇక మహారాష్ట్రలో 2014, 2019 లోక్‌సభ ఎన్నికలకు ఫడ్నవీస్ నాయకత్వం వహించారు. 2014 నుంచి 2019 వరకు మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పాత్రను పోషించారు. ఫడ్నవీస్ నాయకత్వంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రికార్డులు సృష్టించారు. ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా వెళ్లాలంటే ఆ పని చేయాల్సిందే.. షమీకి బీసీసీఐ కండీషన్స్! ఆసక్తికరమైన విషయాలు..దేవేంద్ర ఫడ్నవిస్ న్యాయశాస్త్రంలో పట్టా పొందారు కానీ న్యాయవాదిగా ఎప్పుడూ పనిచేయలేదు. ఏబీవీపీలోలో క్రియాశీలక సభ్యుడిగా ఉంటూ యువతను సమాజ పునర్నిర్మాణం వైపు నడిపించారు. ఇక ఇటీవల నామినేషన్‌లో దాఖలు చేసిన అఫిడవిట్ 2024 ప్రకారం.. అతని ఆస్తుల విలువ రూ. 13 కోట్లకు పైగానే. తన పేరుమీద రూ.13,27,47,728 విలువైన చర, స్థిరాస్తులున్నట్లు వెల్లడించారు. బ్యాంకుల్లో రూ.56,07,867 ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన భార్య అమృతా ఫడ్నవీస్ ఆస్తుల విలువ రూ.6,96,92,748. ఆయన ఒక్కగానొక్క కుమార్తెకు రూ.10,22,113 విలువైన చరాస్తులు ఉన్నట్లు నామినేషన్ లో ప్రకటించారు. ఇది కూడా చదవండి: ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా సోరెన్ ప్రమాణ స్వీకారం ఇక ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 288 స్థానాలకు గానూ 234 సీట్లు గెలుచుకుంది. మహాయుతిలో బీజేపీ 132, శివసేన (షిండే) 57, ఎన్సీపీ (అజిత్) 41 స్థానాల్లో విజయం సాధించారు.