/rtv/media/media_files/2026/03/20/free-gas-2026-03-20-21-13-51.jpg)
Free gas in alappula
Free gas : దేశవ్యాప్తంగా గ్యాస్ కొరతపై చర్చ సాగుతున్న వేళ కేరళకు చెందిన రెత్నమ్మ కథ ఇపుడు అందరినీ ఆకర్షీస్తోంది. ఆమె గత పదేళ్లుగా ఎలాంటి గ్యాస్ సిలిండర్ లేకుండానే గ్యాస్ పై వంట చేస్తుందంటే ఆశ్చర్యం వేయకమానదు. కేరళలోని ఆలప్పుళకు చెందిన రెత్నమ్మ గత 10 ఏళ్లుగా ఆమె ఒక్క గ్యాస్ సిలిండర్ కూడా కొనకుండా వంట చేసుకుంటున్నారు. దానికి కారణం ఆమె ఇంటి ఆవరణలో ఉన్న బావి కావడం గమనార్హం. రెత్నమ్మ 2011లో ఇంటి వద్ద తాగునీటి కోసం బోరు బావి తవ్వించారు. అయితే అది ఎంత లోతుగా తవ్వినా నీరు పడకపోవడంతో నిరాశకు గురయ్యారు. 75 అడుగుల లోతులో నీటి కోసం తవ్విన బోరు బావి నుండి నీరు రాకపోవడంతో అలా వేసిన బావిని అలాగే వదిలేశారు. అయితే కొంతకాలానికి అనుకోకుండా ఆ బావి నుంచి గ్యాస్ వస్తుందని గుర్తించారు. దాన్ని పరిశీలించిన నిపుణులు ఇది ఎల్‌పీజీ కాదు, సహజంగా ఏర్పడే మీథేన్ గ్యాస్ అని తెలిపారు.
భూగర్భంలో ఉన్న సేంద్రియ పదార్థాలు కుళ్లిపోవడం వల్ల ఈ గ్యాస్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. దీనిని ‘మార్ష్ గ్యాస్’ లేదా ‘బయోగ్యాస్’ అంటారు. దీన్ని కూడా వంట గ్యాస్‌గా ఉపయోగించవచ్చని వారు వివరించారు. దీంతో
ఆ గ్యాస్‌ను పైపు ద్వారా నేరుగా వంటగదికి కనెక్ట్ చేసి ఉపయోగించడం ప్రారంభించారు. ఇలా సహజంగా లభించే గ్యాస్‌తో రెత్నమ్మ కుటుంబం ఏ టెన్షన్ లేకుండా వంట చేసుకుంటోంది. 2011 అక్టోబర్ నుంచి వారి ఇంటికి గ్యాస్ సిలిండర్ కొనలేదు.ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నిజంగా ఒక అద్భుతమైన ఉదాహరణ. బోరు బావి నుండి వెలువడే సహజ మిథేన్ వాయువును LPG సిలిండర్లపై ఖర్చు లేకుండా, నిరంతరాయంగా గ్యాస్ సరఫరాను పొందుతున్నారు.
జీయాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారుల సూచనతో రమేషన్- రత్నమ్మ దంపతులు, ఈ గ్యాస్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా, సురక్షితంగా ఉపయోగిస్తున్నారు.
Follow Us