EC: ఎలక్షన్ రూల్స్ మార్పుపై కాంగ్రెస్ ఫైర్.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఎలక్షన్ రూల్స్‌లో ఈసీ చేసిన మార్పులపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈసీ నిబంధనలను సవాలు చేస్తూ ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇలాంటి మార్పుల వల్ల ఎన్నికల సమగ్రత దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

author-image
By srinivas
New Update
SUPREME COURT

సుప్రీం కోర్టులో కాంగ్రెస్ పిటిషన్ దాఖలు

Supreme Court : ఎలక్షన్ రూల్స్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్‌ ఇటీవల చేసిన సవరణలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఇలాంటి మార్పుల వల్ల ఎన్నికల సమగ్రత దెబ్బతినే అవకాశం ఉందంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్‌ రికార్డులను ఎవరైనా చెక్ చేసేందుకు అనుమతించే నిబంధనలను సవాలు చేస్తూ ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొనగా.. కాంగ్రెస్ పిటిషన్ విచారణకు సంబధించిన వివరాలు తెలియాల్సివుంది. 

Also Read :  తిరుపతిలో అపచారం..అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీ పెట్టిన దుండగులు

ప్రజలతో సంప్రదింపులు లేకుండా ఎన్నికల ప్రక్రియ..

ఇక ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961లోని రూల్‌ 93(2)(ఏ)ను కేంద్ర న్యాయశాఖ సవరించిన సంగతి తెలిసిందే. కాగా పోలింగ్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌, వెబ్‌కాస్టింగ్‌ రికార్డులు, అభ్యర్థుల వీడియోలను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. అయితే ఈ చర్యలను కాంగ్రెస్‌ ఖండించింది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్‌.. ఏకపక్షంగా, ప్రజలతో సంప్రదింపులు లేకుండా ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో మార్పులు చేయడంపై మండిపడుతోంది. 

Also Read :  మరి మీరు అలా ఎందుకు చేయలేదు? పోలీసులకు వకీల్ సాబ్ సూటి ప్రశ్నలు!

మహారాష్ట్ర ఓట్ల తొలగింపులో అవతవకలు..

అలాగే ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను ఏకపక్షంగా తొలగించడం లేదా చేర్చడం వంటి చర్యలకు పాల్పడలేదని కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్‌కు వివరించింది. ఓటర్ల లిస్ట్ తయారీలో పాదర్శకత, నిబంధనలు పాటించినట్లు స్పష్టం చేసింది. మహారాష్ట్రలో ఓటర్ల తొలగింపులో అవతవకలు జరగలేదని, కాంగ్రెస్ ప్రతినిధుల భాగస్వామ్యంతో పాటు తగిన ప్రక్రియను అనుసరించామని ఎన్నికల సంఘం పేర్కొంది. 

ఇది కూడా చదవండి: Tiger: శృంగార వేట.. తాడ్వాయి అడవుల్లో తిష్టవేసిన బెంగాల్‌ టైగర్‌!

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై మరోసారి మండిపడ్డారు. పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్ర పోతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం కూరగాయల మార్కెట్‌ వెళ్లి ప్రజలతో మాట్లాడాను. పెరుగుతున్న ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. రూ.40 వెల్లుల్లి ధర ఇప్పుడు రూ.400లకు చేరింది. ఇలా ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఎలా బతకగలడు. వంట గది బడ్జెట్‌ సామార్థ్యానికి మించి పెరిగిపోతోందంటూ విమర్శలు గుప్పించారు. 

Also Read :  నేను ఆడుతా.. నా మోకాలు బాగానే ఉంది: గాయంపై రోహిత్ రియాక్షన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు