హిందూ మహాసముద్రంలో చైనా ‘సైలెంట్’ వార్.. భారత్ తీరంలో డ్రాగన్ నౌకల నిఘా!

దక్షిణాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతుండగా హిందూ మహాసముద్రంలో చైనా తన వ్యూహాత్మక ఉనికిని ప్రమాదకరంగా విస్తరిస్తోంది. శాస్త్రీయ పరిశోధనల ముసుగులో అత్యాధునిక నిఘా నౌకలను మోహరిస్తూ భారత్ తీరప్రాంతాలపై కన్నేసింది.

New Update
_Shi Yan 6

దక్షిణాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతుండగా హిందూ మహాసముద్రంలో చైనా తన వ్యూహాత్మక ఉనికిని ప్రమాదకరంగా విస్తరిస్తోంది. శాస్త్రీయ పరిశోధనల ముసుగులో అత్యాధునిక నిఘా నౌకలను మోహరిస్తూ భారత్ తీరప్రాంతాలపై కన్నేసింది. తాజాగా చైనాకు చెందిన 'షి యాన్ 6' పరిశోధన నౌక సుండా జలసంధి గుండా ప్రవేశించి మాల్దీవుల వైపు పయనించడం కలకలం రేపుతోంది.

పరిశోధన ముసుగులో నిఘా వేట

ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో 8 నుండి 10 చైనా నౌకలు నిరంతరం తిరుగుతున్నాయి. 'డా యాంగ్ హావో', 'డా యాంగ్ యి హావో' వంటి నౌకలు ఆఫ్రికా తీరం నుండి అరేబియా సముద్రం వరకు జల్లెడ పడుతున్నాయి. పైన ఇవి సముద్ర అధ్యయనాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా, లోపల మాత్రం సముద్రగర్భ మ్యాపింగ్ చేస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జలాంతర్గామి యుద్ధతంత్రం: సముద్రగర్భంలోని లోతుపాట్లు, అంధ మండలాలు, నావిగేషన్ కారిడార్లను మ్యాపింగ్ చేయడం ద్వారా భవిష్యత్తులో జలాంతర్గామి యుద్ధాల్లో పైచేయి సాధించాలని చైనా భావిస్తోంది.
వ్యూహాత్మక స్థావరాలు: గతంలో శ్రీలంకలోని హంబంటోట ఓడరేవును వేదికగా చేసుకున్న చైనా, అంతర్జాతీయ ఒత్తిడితో ఇప్పుడు తన కార్యకలాపాలను మాల్దీవుల వైపు మళ్లించింది.

భారత్ అప్రమత్తం.. దీటైన సమాధానం
చైనా కదలికలను భారత నౌకాదళం నిశితంగా గమనిస్తోంది. చైనా వద్ద దాదాపు 50 పరిశోధన నౌకలు ఉండగా, భారత్ వద్ద కేవలం 10 నుండి 12 నౌకలు మాత్రమే ఉన్నాయి. ఈ అంతరాన్ని పూడ్చేందుకు భారత్ 'మత్స్య 6000' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టింది. 6,000 మీటర్ల లోతుకు ముగ్గురు సిబ్బందిని తీసుకెళ్లగల ఈ వాహనం, హిందూ మహాసముద్రంలో భారత శాస్త్రీయ, వ్యూహాత్మక శక్తిని చాటిచెప్పనుంది. అంతర్జాతీయ చట్టాలను అడ్డుపెట్టుకుని చైనా చేస్తున్న ఈ 'సముద్రపు వేట' దక్షిణ ఆసియా శాంతికి సవాలుగా మారింది. డ్రాగన్ ఎత్తుగడలను చిత్తు చేసేందుకు భారత్ తన రక్షణ, పరిశోధన వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు