చిన్న బోనస్ వస్తేనే జాబ్ చేసేవారు ఎంతో సంతోషపడిపోతారు అలాంటిది పెద్ద గిఫ్ట్లు వస్తే..ఎగిరిగంతులు వేయరూ...ప్రస్తుతం చెన్నైకు చెందిన సుర్‌మౌంట్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల పరిస్థితి ఇదే. చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న ఈకంపెనీ యాజమాన్యం తమ దగ్గర పని చేస్తున్న ఉద్యోగుల కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలనుకుంది. వారి పనితం తాము గుర్తించామని చెప్పాలనుకుంది. అంతే వెంటనే కార్లను, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌ను గిఫ్ట్‌లుగా ఇచ్చింది. దాదాపు 20 మందికి ప్రోత్సాహకంగా ఈ ఖరీదైన బహుమతులను అందించింది. తమ గోల్స్ రీచ్ కావడానికి, ఉద్యోగుల్ని ప్రోత్సహించడానికి వీటిని అందిస్తున్నట్లు కంపెనీ చెప్పింది.సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాజిస్టిక్ సెక్టార్‌లో వినియోగదారులు ఎదుర్కొనే ప్రొడక్ట్స్ డిలే, పారదర్శకత లేకపోవడం, అసమర్థమైన సప్లై చైన్ వంటి సమస్యల్ని పరిష్కరిస్తుంది. పనితనం మెరుగుపడుతుంది.. అన్ని వ్యాపారాల్లో లాజిస్టిక్స్‌ను సరళీకృతం చేయడమే తమ కంపెనీ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ డెంజిల్ రాయన్ చెబుతున్నారు. దాంతో పాటూ షిప్పింగ్‌లో లాజిస్టిక్స్ సవాళ్ళను సమర్ధవంతంగా పరిష్కారం అందించే దిశగా తాము వర్క్ చేస్తామని చెబుతున్నారు. ఇక ఉద్యోగులకు ఇచ్చిన బహుమతుల గురించి మాట్లాడుతూ..ఇలాంటి వాఇతో ఉద్యోగులు సంక్షేమం, ఉద్యోగుల సంతృప్తి మెరుగుపరచడంతో పాటు ఉత్పాదకతను కూడా మెరుగుపడచం వంటి వాటిని ప్రోత్సహిస్తుందని చెప్పారు. ప్రేణ పొందిన ఉద్యోగులు మరింత బాగా పని చేస్తారని అన్నారు. Also Read: బాల్య వివాహాలపై అస్సాం కఠిన చర్య.. మరో 416 మంది అరెస్టు