Priyanka Gandhi: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రమేష్ బిధూరీ సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీలోని కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రమేష్ బిధూరి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ బహిరంగ సభలో ప్రియాంక గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బీహార్ రోడ్లను హేమమాలిని చెంపలా చేస్తానని లాలూ హామీ ఇచ్చారని, కానీ అలా చేయలేకపోయారని రమేష్ బిధూరీ చెప్పుకొచ్చారు. ఓఖ్లా, సంగమ్ విహార్ రోడ్లను ఎలా తయారు చేశానో, అలాగే కల్కాజీలో అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపలలాగా నున్నగా చేస్తానని మీకు హామీ ఇస్తున్నానంటూ రమేష్ బిధూరీ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Also Read: పాట్నాలో ప్రశాంత్ కిశోర్ నిరసన.. లగ్జరీ వ్యానుపై విమర్శలు! BJP घोर महिला विरोधी है रमेश बिधूड़ी का प्रियंका गांधी जी के संदर्भ में दिया बयान शर्मनाक ही नहीं उनकी औरतों के बारे में कुत्सित मानसिकता दिखाता है लेकिन जिस आदमी ने सदन में अपने साथी सांसद को गंदी गालियां दी हों, और कोई सज़ा ना मिली हो उससे और क्या उम्मीद की जा सकती है?… pic.twitter.com/JRdC9bxzrw — Supriya Shrinate (@SupriyaShrinate) January 5, 2025 Also Read: మల్లారెడ్డి తమ్ముడిపై కేసు.. సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్! సుప్రియా శ్రీనాట్ ఫైర్ రమేష్ బిధూరీ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాట్ స్పందిస్తూ, రమేష్ బిధూరీ వ్యాఖ్యలు మహిళల పట్ల అతని “అగ్లీ మైండ్‌సెట్”ను ప్రతిబింబిస్తోందని ఆమె తన ఎక్స్‌లో రాశారు. 'బీజేపీ అత్యంత మహిళా వ్యతిరేకి.. ప్రియాంక గాంధీ విషయంలో రమేష్ బిధూరీ చేసిన ప్రకటన సిగ్గుచేటుగా ఉండటమే కాకుండా మహిళల పట్ల ఆయనకున్న అసహ్యకరమైన మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. బిధూరీ వ్యాఖ్యలు బీజేపీ అసలు ముఖాన్ని ప్రతిబింబిస్తోంది " అని ఆమె ట్వీట్ లో తెలిపారు. Also Read: పాట్నాలో ప్రశాంత్ కిశోర్ నిరసన.. లగ్జరీ వ్యానుపై విమర్శలు! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 29 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది, మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై న్యూఢిల్లీ స్థానం నుంచి మాజీ ఎంపీ పర్వేష్ వర్మను బరిలోకి దింపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై కల్కాజీ అభ్యర్థిగా రమేష్ బిధూరి పోటీ చేస్తున్నారు. ఇక ఈ జాబితాలో 8 మంది కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నేతలు ఉన్నారు. Also Read : మల్లారెడ్డి తమ్ముడిపై కేసు.. సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!