అతిశీ తండ్రిని కూడా మార్చింది.. మళ్లీ రెచ్చిపోయిన బీజేపీ నేత

ఢిల్లీ సీఎం ఆతిశీ ఇంటి పేరును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు బీజేపీ నేత రమేష్ బిధూరీ. మర్లెనాగా ఉన్న అతిషి ఇప్పుడు సింగ్. ఆమె తన తండ్రిని కూడా మార్చిందని అన్నారు. దీనిపై ఆప్ మండిపడింది. బీజేపీ నేతల మాటలు హద్దులు దాటుతున్నాయని ట్వీట్ చేసింది.

New Update
athishi cm

athishi cm Photograph: (athishi cm)


ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపలలాగా నున్నగా చేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రమేష్ బిధూరీ మరో వివాదంలో చిక్కుకున్నారు.  తాజాగా ఢిల్లీ సీఎం ఆతిశీ ఇంటి పేరును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.  

ఇంటి పేరు మార్చిన సీఎం

ప్రస్తుతం కాల్కాజీ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న ఆతిశీ..  2019 పార్లమెంట్ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.  మాజీ క్రికెటర్, ఎంపీ గంభీర్‌పై పోటీకి దిగిన ఆమె .. తన ఇంటి పేరు మార్చుకుందని అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రత్యర్థులు. తాజాగా వాటినే  రమేష్ బిధూరీ ప్రస్తావిస్తూ కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని రోహిణిలో జరిగిన బహిరంగ సభలో బిధురి మాట్లాడుతూ, మర్లెనాగా ఉన్న అతిషి ఇప్పుడు సింగ్. ఆమె తన తండ్రిని కూడా మార్చిందని అన్నారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ..  బీజేపీ నాయకుల మాటలు హద్దులు దాటుతున్నాయని  ఫైరయ్యారు. ఢిల్లీ ప్రజలు మహిళా ముఖ్యమంత్రిని అవమానించడాన్ని సహించరని..  మహిళలందరూ ఓట్లతో బీజేపీకి బుద్ది చెబుతారని అన్నారు.   పొరపాటున రమేష్ బిధూరీ ఎమ్మెల్యే అయిపోతే సామాన్య మహిళలకు ఎలాంటి అవస్థలు ఎదురవుతాయో ఊహించుకోండి అంటూ ఆప్ ట్వీట్ చేసింది.

కాగా 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషిపై బిధురి పోటీ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 29 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది, మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై న్యూఢిల్లీ స్థానం నుంచి మాజీ ఎంపీ పర్వేష్ వర్మను బరిలోకి దింపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై కల్కాజీ అభ్యర్థిగా రమేష్ బిధూరి పోటీ చేస్తున్నారు.  ఇక ఈ జాబితాలో 8 మంది కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల నుంచి వచ్చిన సీనియర్‌ నేతలు ఉన్నారు. 

Also Read :  పోలీసుల అదుపులో ప్రశాంత్‌ కిషోర్‌..ఎయిమ్స్‌ కు తరలింపు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు