ఒకప్పుడు రాబిన్ ఊతప్ప పెద్ద క్రికెటర్. మొట్టమొదటిసారి టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో కూడా ఉన్నాడు. టీమ్‌ఇండియా తరఫున 59 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 54 వన్డే ఇన్నింగ్స్‌లో 1,183 పరుగులు నమోదు చేశాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక రాబిన్ బెంగళూరుకు చెందిన సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి రాబిన్ ఉతప్ప డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించే అతను అరెస్ట్ వారెంట్ ఎదుర్కొంటున్నాడు. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల నుంచి పీఎఫ్‌ను కట్ చేసినప్పటికీ వాటిని వారి ఖాతాల్లో జమ చేయలేదు. దాదాపు రూ.23 లక్షలను ఉతప్ప తన ఉద్యోగుల ఖాతాలో జమ చేయకుండా మోసం చేశారని తేలడంతో పీఎఫ్ రీజనల్ కమిషనర్ అతడికి నోటీసులు జారీ చేశారు. వాటిని అందజేసేందుకు డిసెంబరు 4న పులకేశినగర్‌లోని మాజీ క్రికెటర్ నివాసానికి వెళ్లారు. అయితే అతను అక్కడ లేడు. దీంతో రాబిన్ పై తగిన చర్యలు తీసుకోవాలని పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రాబిన్ ఊతప్పపై అరెట్ వారెంట్ జారీ అయింది. డిసెంబరు 27లోగా అతడు బకాయిలు చెల్లించాలని లేదంటే అరెస్టు తప్పదని వారెంట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉతప్ప కుటుంబం దుబాయ్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.