Summer Tips: మీ ఫ్యాన్ ఏసీలా మారాలంటే ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు.. ఫుల్ కూలింగ్..!

వేసవి కాలంలో భానుడు భగభగమంటున్నాడు. ఎండ వేడికి ఇళ్లన్నీ సెగలు కక్కుతున్నాయి. మధ్యతరగతి ఇళ్లలోని ఫ్యాన్లు కూడా ఎండ తీవ్రతకు వేడి గాలినే కిందకు నెడుతుంటాయి. కొన్ని ట్రిక్స్ పాటిస్తే ఫ్యాన్‌ను చల్లటి గాలినిచ్చే ఏసీలా మార్చుకోవచ్చు.

New Update
summer-tips-for-cool-fan-air-telugu news (1)


వేసవి కాలం వచ్చేసింది. ఉదయం నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఎండ వేడికి ఇళ్లన్నీ సెగలు కక్కుతున్నాయి. ముఖ్యంగా ఏసీలు, కూలర్లు లేని మధ్యతరగతి ఇళ్లలో ఫ్యాన్లు దిక్కు. అవి కూడా ఎండ తీవ్రతకు వేడి గాలినే కిందకు నెడుతుంటాయి. అయితే కొన్ని ట్రిక్స్ పాటిస్తే ఫ్యాన్‌ను చల్లటి గాలినిచ్చే ఏసీలా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

summer tips for cool fan air

ఫ్యాన్ బ్లేడ్ల క్లీనింగ్

చాలా మంది ఫ్యాన్ బ్లేడ్లకు పేరుకుపోయిన దుమ్మును అస్సలు పట్టించుకోరు. అయితే దీనివల్ల గాలి అస్సలు రాదు. బ్లేడ్లకు దూళి ఉన్నంతవరకు గాలి వేగం తగ్గుతూనే ఉంటుంది. అలాగే మోటార్‌పై కూడా ప్రభావం పడుతుంది. అందువల్ల రెక్కలను క్లీన్ చేసుకోవడం బెటర్.

ఫ్యాన్ డైరెక్షన్ మార్చడం:

సాధారణంగా ఫ్యాన్‌లు రెండు డైరెక్షన్లలో తిరుగుతాయి. అందులో ఒకటి క్లాక్ వైజ్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్. ఈ రెండింటిలో వేసవి సీజన్‌ కోసం ఫ్యాన్ యాంటీ క్లాక్ వైజ్ (గడియారపు ముళ్లకు వ్యతిరేక డైరెక్షన్) తిరిగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తిరిగినపుడు గాలి డైరెక్ట్‌గా కిందకు వస్తుందని.. దీని వల్ల రూమ్‌లోని వేడి గాలి బయటకు పోయి చల్లటి అనుభూతిని ఇస్తుందని చెబుతున్నారు. 

ఐస్ బాటిల్ ట్రిక్

టేబుల్ ఫ్యాన్స్ ఉపయోగించేవారికి ఈ ట్రిక్ చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం ముందుగా రెండు ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకుని.. అందులో నీళ్లు నింపాలి. ఆ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి గడ్డ కట్టేవరకు ఉంచాలి. తర్వాత వాటిని బయటకు తీసి టేబుల్ ఫ్యాన్ వెనుక భాగంలో లేదా ఫ్యాన్ ముందు ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఫ్యాన్ తిరుగుతున్నపుడు ఆ మంచు గడ్డలు కరిగి చల్లదనాన్ని వ్యాప్తి చేస్తుంది. 

క్రాస్ వెంటిలేషన్

రూమ్‌లో గాలి లేకపోతే ఫుల్‌గా ఉక్కపోస్తుంది. అందువల్ల ఉదయం పూట కాకుండా సాయంత్రం వేళల్లో రూమ్ కిటికీలను తెరిచి ఉంచాలి. అందులో ఒక కిటికీ వద్ద ఫ్యాన్ పెట్టి బయట గాలి లోపలికి వచ్చేలా చూడాలి. ఇక అదే సమయంలో వేడిగాలి బయటకు వెళ్లేలా మరో కిటికీని ఏర్పాటు చేయాలి. 

ఎగ్జాస్ట్ ఫ్యాన్

ఈ సీజన్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించాలి. వంటగది, బాత్‌రూమ్‌లో ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లను సాయంత్రం వేళల్లో ఆన్ చేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల రూమ్‌లోని వేడి గాలిని బయటకు పంపి చల్లగా ఉంచుతుంది. 

Advertisment
తాజా కథనాలు